పిల్ల ఏనుగుకు అంతిమ సంస్కారాలు నిర్వ‌హించిన పెద్ద ఏనుగులు.. వైర‌ల్ వీడియో..!

657

అచ్చం మ‌నుషులు నిర్వ‌హించే అంతిమ సంస్కారాల కార్య‌క్ర‌మం లాగే ఏనుగులు కూడా ప్ర‌వ‌ర్తించాయి. దీంతో ఆ వీడియో కాస్తా ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అవుతోంది.

ఎవ‌రైనా మ‌నిషి చ‌నిపోతే.. ఆ మ‌నిషికి చెందిన వ‌ర్గం వారు త‌మ ఆచార వ్య‌వ‌హారాలు, సాంప్ర‌దాయాల‌కు అనుగుణంగా ఆ మ‌నిషి మృత‌దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వ‌హిస్తారు. అయితే ఇలా చ‌నిపోయిన వారికి అంతిమ సంస్కారాలు చేయ‌డం అనేది కేవ‌లం మ‌నుషులే చేస్తారు. జంతువులు చేయ‌లేవు. కానీ తాజాగా నెట్‌లో వైర‌ల్ అవుతున్న ఓ వీడియో మాత్రం ఆ విష‌యం త‌ప్ప‌ని మ‌న‌కు చెబుతోంది. జంతువులు కూడా త‌మ జాతికి చెందిన జీవాలు చ‌నిపోతే అంతిమ సంస్కారాలు చేయ‌గ‌ల‌వు. అవును నిజ‌మే. కావాలంటే కింద ఇచ్చిన ఈ వీడియోను చూడండి.

చ‌నిపోయిన త‌న పిల్ల ఏనుగును తీసుకుని ఓ ఏనుగు అడ‌విలో రోడ్డు దాటుతోంది. అయితే మిగిలిన ఏనుగులు వ‌చ్చే వ‌ర‌కు ఆ ఏనుగు ఆ పిల్ల ఏనుగు శ‌వాన్ని అక్క‌డే రోడ్డు మీద ఉంచింది. ఆ త‌రువాత ఒక ఏనుగుల గుంపు అక్క‌డికి వ‌చ్చింది. ఒక నిమిషం పాటు అక్క‌డ అవి ఎవ‌ర్నో ప్రార్థించిన‌ట్లు ఉన్నాయి. అనంత‌రం అన్నీ క‌ల‌సి ఆ పిల్ల ఏనుగును తీసుకెళ్తున్న త‌ల్లి ఏనుగు వెంట న‌డిచాయి. అయితే అక్క‌డికి కొంత దూరంలో కొంద‌రు వాహ‌న‌దారులు రోడ్డుపై జ‌రిగిన ఆ కార్య‌క్ర‌మాన్ని వీక్షిస్తూ ఉండిపోయారు. ఇక ఈ ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందో స‌రిగ్గా తెలియ‌దు. కానీ నెట్‌లో ఇప్పుడీ వీడియో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

కాగా అచ్చం మ‌నుషులు నిర్వ‌హించే అంతిమ సంస్కారాల కార్య‌క్ర‌మం లాగే ఏనుగులు కూడా ప్ర‌వ‌ర్తించాయి. దీంతో ఆ వీడియో కాస్తా ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అవుతోంది. ఆ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ప‌ర్వీన్ కాస్వాన్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోను ఇప్ప‌టికే చాలా మంది వీక్షించి షేర్ చేశారు. ఏనుగులు అలా చ‌నిపోయిన త‌మ జాతి జీవానికి అంతిమ సంస్కారాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌వ‌ర్తించ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌మేన‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. దీన్ని బ‌ట్టి కేవ‌లం మ‌నుషుల‌కే కాదు, జంతువుల‌కు కూడా మ‌న‌స్సు ఉంటుంద‌ని మ‌న‌కు స్ప‌ష్టంగా తెలుస్తుంది. ఏది ఏమైనా.. ఈ వీడియో మాత్రం చాలా మందికి షాక్‌కు గురి చేస్తోంది..!