పవన్ సరసన అనుష్క… ఫైనల్ చేసారా…?

-

రాజకీయాలను పక్కన పెట్టి సినిమాలు చేస్తున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయన సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే ఇప్పుడు దర్శకులు ఆయనతో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. అయితే కరోనా వైరస్ కారణంగా చిత్ర యూనిట్ షూటింగ్ ని వాయిదా వేసింది.

ఈ సినిమా కరోనా తగ్గగానే షూటింగ్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వకీల్ సాబ్ అనే టైటిల్ ని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ సినిమాలో పవన్ పాత్ర పై క్రిష్ కొత్త అంచనాలు పెట్టాడు. పాత్ర అలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో పవన్ అభిమానులు హడావుడి చేస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గురించి కూడా పెద్ద చర్చలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ 27 వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సీనియర్ హీరోయిన్ అనుష్క ని ఖరారు చేసినట్టు సమాచారం. గతంలో క్రిష్ అనుష్క తో వేదం అనే సినిమా చేసారు. ఆ ప‌రిచ‌యంతోనే క్రిష్ అడ‌గ‌టంతో మ‌రోసారి ఆయన సినిమాలో న‌టించ‌డానికి ఓకే అన్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ సినిమా కరోనా తగ్గితే షూటింగ్ కి వెళ్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news