సైరాలో అనుష్క.. సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యేనా..!

-

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాలో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్స్ నటిస్తున్నారు. సినిమాలో ఫీమేల్ లీడ్ గా కోలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న నయనతారని తీసుకున్నారు.

అయితే ఈమధ్యనే సైరాలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఉంటున్నట్టు రివీల్ అయ్యింది. ఇప్పుడు నయన్, తమన్నాలతో పాటుగా స్వీటీ అనుష్క కూడా సినిమాలో భాగమవుతుందట. సైజ్ జీరో తర్వాత పర్సనాలిటీ పరంగా కాస్త బొద్దుగా మారిన అన్సుహ్క బాహుబలి-2, సింగం-3, భాగమతి సినిమాలను ఎలాగోలా మ్యానేజ్ చేసింది. రీసెంట్ గా కాస్త తగ్గినట్టు అనిపిస్తున్న అనుష్క సైలెంట్ గా సైలెన్స్ అనే సినిమా చేస్తుంది.

ఇక సైరా సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కు అనుష్కను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అనుష్కను తీసుకోవడంలో ఓ సెంటిమెంట్ కూడా ఉందట. ఇలాంటి హిస్టారికల్ మూవీస్ లో అనుష్క ఆల్రెడీ సక్సెస్ అయ్యింది కాబట్టి ఆమె వల్ల సినిమాకు మరింత క్రేజ్ రావడమే కాకుండా ఆ సెంటిమెంట్ తో సినిమా హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు. మరి అనుష్క సైరాలో ఎలాంటి రోల్ లో కనబడుతుంది అన్నది సినిమా వస్తేనే కాని చెప్పగలం.

Read more RELATED
Recommended to you

Latest news