‘Where is వెంకటలక్ష్మి’ టీజర్.. రాయ్ లక్ష్మి అందాల ఎర..!

-

తెలుగులో కాంచనమాల కేబుల్ టివి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాయ్ లక్ష్మి ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో అరకొర అవకాశాలతో సరిపెట్టుకుంది. హీరోయిన్ గా ఛాన్సులు రాకున్నా స్పెషల్ సాంగ్స్ తో అలరిస్తున్న అమ్మడు ఖైది నంబర్ 150తో ఓసోసి రత్తాలు అంటూ చిరుతో స్టెప్పులేసింది రాయ్ లక్ష్మి. బాలీవుడ్ లో జూలీ సీక్వెల్ లో నటించినా లాభం లేకుండా పోయిన రాయ్ లక్ష్మి ప్రస్తుతం తెలుగులో వేర్ ఈజ్ వెంకటలక్ష్మి సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. టీజర్ చూస్తే రాయ్ లక్ష్మి అందాలనే ఎరగా వేస్తున్నట్టు కనిపిస్తుంది. కిశోర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రాయ్ లక్ష్మితో పాటుగా పూజిత పొన్నాడ, ప్రవీణ్, కార్తిక్ నటిస్తున్నారు. టీజర్ చూస్తే ఇది కూడా రాయ్ లక్ష్మి అందాలని బాగా వాడేసినట్టు తెలుస్తుంది. కళ్లతోనే అందరిని పడేసే ఈ కాంచన బ్యూటీ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news