ఫ్యాన్ అత్యుత్సాహం.. బాలీవుడ్ స్టార్ సింగర్​కు గాయం

-

బాలీవుడ్​ స్టార్​ సింగర్​ అర్జిత్​ సింగ్ అంటే ఇష్టం లేని మ్యూజిక్ లవర్స్ ఉండరు. ఆయన వాయిస్​లో డెప్త్ కు ఫిదా కానీ వారంటూ ఉండరంటే అతిశయోక్తి లేదు. ఇక అర్జిత్ సింగ్ కన్సర్ట్ అంటే ఫ్యాన్స్ పరుగులు తీస్తుంటారు. ఇటీవల మహారాష్ట్ర ఔరంగాబాద్​లో ఓ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. ఇందులో భాగంగా అభిమానుల కోసం పలు పాటలు పాడారు. సాధారణంగా ఆయన కన్సర్ట్​ చేస్తున్న సమయంలో.. పాటలు పాడుతూ అప్పుడప్పుడూ తన అభిమానులను పలకరిస్తుంటారు. అలానే సోమవారం జరిగిన కాన్సర్ట్​లో కూడా ఆయన స్టేజీ పై నుంచే అభిమానులను పలకరిస్తూ వచ్చారు.

ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని అర్జిత్​కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. అలా ఇస్తున్న సమయంలో ఆయన చెయ్యి పట్టుకొని గట్టిగా ఊపేసి, లాగేసింది. ఆమె చూపిన అత్యుత్సాహం వల్ల అర్జిత్ అదుపు తప్పి పడబోయారు. ఈ క్రమంలోనే ఆయన చేతికి గాయమైంది. ఫ్యాన్ అర్జిత్ చేయిని గట్టిగా లాగడం వల్ల అతడి చేయి బెణికినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news