జనగామలో ముత్తిరెడ్డికి రివర్స్..డ్యామేజ్ ఖాయమే.!

-

ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఈసారి ఏకంగా ఆయనపై..సొంత కూతురు ఫిర్యాదు చేశారు.  సిద్దిపేట జిల్లా చేర్యాలలో తనకు సంబంధించిన ఎకరం 20 గుంటల భూమిని ముత్తిరెడ్డి ఆక్రమించుకున్నారని ఆయన సొంత కూతురు తుల్జాభవాని రెడ్డి ఆరోపిస్తున్నారు. తన సంతకం ఫోర్జరీ చేసి భూమి తీసుకున్నారని, ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ముత్తిరెడ్డిపై కుమార్తె ఫిర్యాదు చేశారు.

ఇక ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలోను ఈ భూమిపై వివాదం నడవగా, చెరువు భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ విపక్షాలు ఆరోపించాయి. ఇక ఆ మధ్య ఓ వివాదాస్పద 6 ఎకరాల స్థలంలో మున్సిపల్ నాలాకు అడ్డంగా వెంచర్ వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే మత్తడి సమీపంలో ముత్తిరెడ్డి యాదగిరి అర ఎకరం స్థలాన్ని ఆక్రమించారని విపక్ష నేతలు ఆరోపణలు చేశారు. ఇలా ఎప్పటికప్పుడు ముత్తిరెడ్డిపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇక అవి నిరూపించాలని ప్రతిపక్షాలకు ముత్తిరెడ్డి సవాల్ విసురుతూనే ఉన్నారు. మరి ఇప్పుడు సొంత కూతురు ఫిర్యాదు చేసింది..ఇక ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.

కానీ ఈ ఆరోపణలు ముత్తిరెడ్డికి రాజకీయంగా పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. గత రెండు ఎన్నికల్లో జనగామ నుంచి తిరుగులేకుండా గెలుస్తున్న ముత్తిరెడ్డికి ఈ సారి గట్టి దెబ్బ పడేలా ఉంది. ఈ ఆరోపణలు డ్యామేజ్ చేసేలా ఉన్నాయి. అటు కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు ప్లస్ అవుతున్నాయి. గతంలో కాంగ్రెస్ నుంచి నాలుగుసార్లు గెలిచిన పొన్నాల..గత రెండు ఎన్నికల్లో ఓడిపోతున్నారు. దీంతో ఆయనపై కాస్త సానుభూతి ఉంది..ఇప్పుడు ముత్తిరెడ్డిపై వ్యతిరేకత పొన్నాలకు కలిసి రావచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news