వర్మ కాస్త ఆదిత్య వర్మ అయ్యాడు..!

-

విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా తమిళ రీమేక్ వర్మ ఇప్పుడు మరో టైటిల్ తో వస్తుంది. చియాన్ విక్రం తనయుడు ధ్రువ్ హీరోగా తెరకెక్కుతున్న అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ బాల డైరక్షన్ లో చేసిన వర్మ మొత్తం చెత్తబుట్టలో వేశారు. సినిమా అవుట్ పుట్ సరిగా రాలేదనే కారణం చేత అలా చేయాల్సి వచ్చిందట. ఇక ఈ సినిమా తమిళ వర్షన్ కు ఒరిజినల్ అర్జున్ రెడ్డికి అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన గిరీశయ్య డైరెక్ట్ చేస్తున్నాడు.

వర్మగా ఉన్న ఈ రీమేక్ టైటిల్ ఆదిత్య వర్మగా మారింది. ఇక ఈ సినిమాకు సంబందించిన మరో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఆదిత్య వర్మ పోస్టర్ అచ్చం అర్జున్ రెడ్డికి దగ్గరగా ఉండటంతో తమిళ అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు. సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ ఈ సినిమాకు కెమెరా మెన్ గా పనిచేస్తున్నారు. ఆదిత్య వర్మ అయినా అర్జున్ రెడ్డి తరహాలో ఉంటాడా లేదా అన్నది సినిమా వస్తేనే కాని చెప్పలేం.

Read more RELATED
Recommended to you

Latest news