ఇష్టదేవతారాధన చేసుకోండి ఈరాశి వారికి మంచి జరుగుతుంది! ఫిబ్రవరి 20 రాశి ఫలాలు

-

ఫిబ్రవరి 20 బుధవారం- రోజువారి రాశి ఫలాలు

20th February 2019 Wednesday horoscope
20th February 2019 Wednesday horoscope

మేషరాశి: అనుకూలమైన ఫలితాలు, ధనలాభం, కుటుంబంలో సంతోషం, కొత్త ప్రయత్నాలకు అనుకూలం. పరిహారాలు ఇష్టదేవతారాధన చేయండి

వృషభరాశి: మిశ్రమ ఫలితం, పనుల్లో జాప్యం, అధికవ్యయం, శుభమూలక ఖర్చు, వ్యాపారనష్టం. బుధగ్రహానికి ప్రదక్షణలు, పచ్చని పూలతో బుధున్ని ఆచరించండి.

మిధునరాశి: అనుకూలమైన రోజు, కార్యజయం, శ్రమఅధికం, మిత్రులతో విందులు. చిన్నచిన్న సమస్యలు ఉంటాయి కానీ అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. పరిహారాలు నవగ్రహస్తోత్ర పఠనం లేదా ఇష్టదేవతారాధన చేయండి.

కర్కాటకరాశి: ప్రతికూల ఫలితాలు, కుటుంబంలో వివాదాలు, ధననష్టం, పనుల్లో జాప్యం. పరిహారాలు నవగ్రహస్తోత్ర పఠనం/ ప్రదక్షణలు చేయండి లేదా చాలీసా పఠనం చేయండి తప్పక మంచి ఫలితాలు వస్తాయి.

సింహరాశి:మంచి ఫలితాలు, కార్యలాభం, ధనలాభం, విందులు, బాకీలు వసూలు, చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నా అధిగమిస్తారు. పరిహారాలు వివాదాలకు దూరంగా ఉండండి. లక్ష్మీ దేవిని పచ్చని పూలతో ఆరాధించండి. ఆరావళి వత్తులతో దీపారాధన చేయండి.

కన్యారాశి: మిశ్రమ ఫలితాలు, కార్యనష్టం, పనుల్లో జాప్యం, వాహన సుఖం, శుభమూలక ఖర్చు. పరిహారాలు పచ్చని పూలతో దేవతారాధన లేదా నవగ్రహ ప్రదక్షణ చేయండి.

తులారాశి: అనుకూలమైన రోజు, మిత్రుల సహకారం, బంధువుల రాక, పరిహారాలు ఇష్టదేవతారాధన చేసుకోండి చాలు.

వృశ్చికరాశి: మంచి ఫలితాలు, పనుల్లో అనుకూలం, చేసే పనుల్లో లాభం, ప్రయాణ సుఖం, పరిహారాలు ఇష్టదేవతారాధన చేసుకోండి చాలు.

ధనస్సురాశి: కార్యలాభం, విందులు, పనుల్లో ఆటంకాలు, బాకీలు వసూలు. పరిహారాలు చాలీసా పఠనం లేదా ఎర్రని వత్తులతో దీపారాధన చేసి ఇష్టదేవతరాధన చేయండి.

మకరరాశి: మిశ్రమ ఫలితాలు, పనుల్లో వేగం, అధికారుల సఖ్యత, వ్యసనాలు, ఖర్చులు. పరిహారాలు సూర్యనమస్కారాలు, తులసీ ప్రదక్షణ చేయండి మంచి జరుగుతుంది.

కుంభరాశి: మిశ్రమ ఫలితాలు, ధనలాభం, శ్రమ అధికం, వాహనంతో జాగ్రత్త. పరిహారాలు ఈశ్వర ఆరాధన లేదా విష్ణు పారాయణం చేయండి.

మీనరాశి: మంచి ఫలితాలు, కార్యలాభం, ధనలాభం, సంతోషం. పరిహారాలు ఇష్టదేవతరాధన, సింధూరధారణ చేయండి.

నోట్  పరిహారాలు ఎక్కువగా పెద్దలు, పండితులు ఆయా సందర్భాలలో సూచించినవి చెపుతున్నాను. ముఖ్యంగా అందరిని అంటే ఆర్థిక, కాల, కుటుంబ పరిస్థితులకు అనుకూలంగా ఖర్చులేనివి, తప్పక ఫలితాన్ని ఇచ్చేవి రాస్తున్నాను. నమ్మకంతో ఆచరించండి తప్పక ఫలితాలు వస్తాయి. గోచార ఫలితాలు కేవలం 40 శాతం మేర మాత్రనే ప్రభావం చూపిస్తాయి. మీ జన్మనక్షత్రం, సమయం, తేదీ ఆధారంగా పూర్తి ఫలితాలు ఉంటాయి. జన్మనక్షత్రం ఉంటే దాని ఆధారంగా రాశి+ గోచార అంటే మీ పేరుమీద రాశి ఫలితాలను కలిపి చూసుకోండి, పరిహారాలను ఆచరించండి మంచి ఫలితాలను అనుభవించండి. ఓం నమో వేంకటేశాయన

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news