చరణ్ విలన్ గా ఆర్యన్ రాజేష్..!

-

రంగస్థలం తర్వాత రాం చరణ్ క్రేజీ డైరక్టర్ బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో భరత్ హీరోయిన్ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో చరణ్ కు ప్రతినాయకుడిగా ఆర్యన్ రాజేష్ నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ప్రశాంత్ కూడా నటిస్తున్నాడట.

అయితే ఆర్యన్ రాజేష్ మెయిన్ విలన్ కాదట.. సినిమాలో ఆర్యన్ రాజేష్ పాత్ర నెగటివ్ షేడ్స్ తో ఉంటుందట. సినిమాలో చరణ్ అసలు విలన్ గా వివేక్ ఒబేరాయ్ నటిస్తున్నాడు. సినిమా కోసం వివేక్ కు భారీగానే ఇస్తున్నారట. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాతో చరణ్ మరో మెగా హిట్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు.

ఈవివి తనయుడిగా అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ ఇద్దరు హీరోలుగా పరిచయమైనా నరేష్ మాత్రం హీరోగా సెట్ రైట్ అయ్యాడు. అయితే ఈమధ్య అల్లరోడికి హిట్ పడట్లేదు. అందుకే అతను కూడా మహేష్ సినిమాలో సపోర్ట్ రోల్ చేస్తున్నాడు. మరి అన్నదమ్ములిద్దరు స్టార్ సినిమాలతో బిజీ అవుతారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news