యూటర్న్ ఆది ఫస్ట్ లుక్.. కనిపించి కనిపించకుండా..!

-

కన్నడలో సూపర్ హిట్ అయిన యూటర్న్ సినిమా అక్కడ సంచలన విజయం అందుకోగా ఆ సినిమా తెలుగులో రీమేక్ రాబోతుంది. సమంత లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా మాత్రుక దర్శకుడు పవన్ కుమారే తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తుండటం విశేషం.

ఈ సినిమా నిర్మాణంలో సమంత కూడా భాగస్వామ్యం అయ్యిందని తెలుస్తుంది. సినిమాలో ఆది పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడట. దానికి సంబందించిన ఫస్ట్ లుక్ రివీల్ అయ్యింది. ఆది లుక్ కనిపించి కనిపించకుండా డిజైన్ చేశారు. సమంత మనసు పడి మరి తెలుగు రీమేక్ చేస్తున్న ఈ యూటర్న్ కచ్చితంగా తెలుగు ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేస్తుందని చెప్పొచ్చు.

పెళ్లి తర్వాత సమంత కమర్షియల్ సినిమాల్లో కాకుండా కథా బలం ఉన్న సినిమాల్లో నటించాలని అనుకుంటుంది. పెళ్లికి ముందు ఎలాంటి ఫాంలో ఉందో అలానే పెళ్లి తర్వాత కూడా సామ్ అదే ఫాం కొనసాగిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news