ఇలా పెళ్ళైందో లేదో అలా గుడ్ న్యూస్ చెప్పిన నిఖిల్ ..!

క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపిడేస్ సినిమాతో కెరీర్ ప్రారంభించాడు నిఖిల్ సిద్దార్థ్. అయితే ఇది నిఖిల్ కి సోలో సినిమా కాకపోయినప్పటికి తనకి ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. ఆ తర్వాత స్వామీ రా రా, కార్తికేయ, కేశవ, అర్జున్ సురవరం లాంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి మార్కెట్ ని హీరోగా క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

 

ఇక రీసెంట్ గా పెళ్ళి చేసుకొని ఒక ఇంటివాడైయ్యాడు నిఖిల్. ఇలా పెళ్ళి చేసుకున్నాడో లేదో అలా తన కొత్త సినిమా అప్‌డేట్ తో ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. చందు మొండేటి డైరెక్షన్ లో నిఖిల్ హీరోగా “కార్తికేయ – 2 ” సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య తో తీసిన సవ్యసాచి తర్వాత నుండి చందు మొండేటి ఈ సినిమా స్క్రిప్ట్ మీదే ఉన్నాడు.

 

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమా ని ఎలాంటి నేపథ్యంలో తీయబోతున్నారో హింట్ ఇచ్చాడు. ఈ సినిమా కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో చందు మొండేటి, నిఖిల్ సెన్షేషనల్ హిట్ ని దక్కించుకున్నారు. అప్పటి నుంచే ఈ సినిమాకి సీక్వెల్ ని తీయాలని ఈ ఇద్దరు ప్లాన్ చేసినప్పటికి అది ఇన్నాళ్ళకి కార్యరూపం దాల్చింది.

ఇక తాజాగా అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాని రూ.25 కోట్ల బడ్జెట్‌ తో రూపొందించనున్నారని తెలుస్తుంది. యాక్షన్ సీక్వెన్స్, భారీగా విఎఫ్ఎక్స్ వర్క్ ఉండటంతో ఈ సినిమాకి అంత బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. అయితే ఇది అంత పెద్ద బడ్జెట్ కాదు మినిమం బడ్జెట్ తోనే పక్కా ప్లాన్స్ తోనే నిర్మించనున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.