” నిశబ్ధం ” సినిమా విషయంలో కోన వెంకట్ ఇచ్చిన క్లారిటీ అదిరిపోయింది ..ఇక రూమర్స్ ఆపండి ..!

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క భాగమతి తర్వాత కాస్త గ్యాప్ తీసుకొను వస్తున్న సినిమా ‘నిశ్శబ్దం’. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ బ్యాగ్డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాని హేమంత్‌ మధూకర్‌ తెరకెక్కించారు. నాలుగు ప్రధాన భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోనా ఫిల్మ్‌ కార్పొరేషన్‌ బ్యానర్లపై కోన వెంకట్‌, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు.

 

ఇక ఈ సినిమాలో అనుష్కతో పాటు మాధవన్‌, అంజలి, షాలినీ పాండే.. ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ అన్ని భాషల ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే వాస్తవంగా ఈ సినిమాని ఏప్రిల్‌ నెలలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేశారు. కాని కరోరానా మూలాన విధించిన లాక్‌డౌన్‌ తో సినిమాలన్నిటి తో పాటు నిశబ్ధం కూడా వాయిదా పడింది.

 

ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్దమయ్యారు. వాటిలో తెలుగులో ముందు కీర్తి సురేష్ నటించిన “పెంగ్విన్” రిలీజ్ కానుంది. అలాగే సూర్య నిర్మాతగా తన భార్య తో తెరకెక్కించిన ఒక తమిళ సినిమాని ఓటీటీలో లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నారంటూ గత కొన్నిరోజులుగా రూమర్లు‌ మొదలయ్యాయి.

ఈ రూమర్స్ కి చెక్ పెట్టారు తాజాగా చిత్రనిర్మాత కోన వెంకట్. తన ‌ట్వీట్‌తో ఈ సినిమా రిలీజ్‌పై వస్తోన్నవన్ని రూమర్స్ అని ‘సినిమా పట్ల మాకున్న అమితమైన ఆసక్తి, ప్రేమతోనే పరిశ్రమలోకి అడుగుపెట్టాం. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నాం. మేము తీసిన సినిమా చూసి థియేటర్‌లో ప్రేక్షకులు ఇచ్చే రియాక్షనే మాకు ప్రేరణ, ఆక్సిజన్‌. ఆ ఫీలింగ్‌ను ఏదీ మ్యాచ్‌ చేయలేదు. సినిమా ఉన్నది సినిమా హాళ్ల కోసమే. అదే మా ప్రాధాన్యం కూడా….!!’ అని కోన వెంకట్‌ ట్వీట్‌ తో క్లారిటి ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news