పాయల్ ను ఫాలో అవుతున్న అషూ రెడ్డి.. కారణం అదేనా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె మొదటి సినిమాతోనే.. బోల్డుగా నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఆ తర్వాత వరుస ఫోటోషూట్లతో గ్లామర్ షో తో కనువిందు చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత క్రమంలో సినిమాలలో అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే బ్రా లెస్ ఫోటోలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా ఎద అందాలను ఓపెన్ చేసి మరింత రచ్చ చేసింది. లో దుస్తులు తీసి కోటు ధరించి బటన్స్ విప్పి మరీ..ఎద అందాలు చూపించి మరింత హాట్ టాపిక్ గా మారి.. కుటుంబ సభ్యుల చేత చివాట్లు కూడా పడింది. అయితే ప్రస్తుతం ఈమె దారిలోనే జూనియర్ సమంత , సోషల్ మీడియా సెలబ్రిటీ అషూ రెడ్డి కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకొని అటు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ తో .. ఇటు బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ప్రస్తుతం గ్లామర్ ప్రపంచంలో అవకాశాల కోసం గ్రామర్ షో చేయక తప్పడం లేదు.

ఈ క్రమంలోనే హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ మరింతగా రెచ్చిపోతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా గతంలో పాయల్ రాజ్ పుత్ చేసినటువంటి ఫోటోషూట్ ని ఫాలో అవుతూ తాను కూడా ఇప్పుడు ఒక ఫోటోషూట్ వదిలింది. అందులో లోదుస్తులు తీసేసి పైన కోట్ బటన్ విప్పి మరీ ఎద అందాలను చూపించింది ఈముద్దుగుమ్మ.

అయితే ఈ ఫోటోలు చూసిన తర్వాత అవకాశాల కోసం మరీ ఇంత దిగజారాలా? బాడీని ఎక్స్ప్రెస్ చేసి చూపించడం ఎంతవరకు న్యాయం..? అంటూ అభిమానుల సైతం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పాయల్ ఫోటోషూట్ ఈమెకు ఏ రకంగా పాపులారిటీ తెచ్చి పెడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news