ఓటీటీలోకి ‘రామబాణం’ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

-

టాలీవుడ్ హీరో గోపించద్.. డింపుల్ హయాతీ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్​టైనర్ రామబాణం. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా రామబాణం ఓటీటీ రిలీజ్‌ డేట్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్‌ దక్కించుకుంది. ఈ సినిమాను జూన్‌ 3 నుంచి స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

పీపుల్ మీడియా బ్యానర్‌పై వివేక్‌ కూచిబొట్ల ఈ సినిమాను నిర్మించాడు. ఇక రిలీజ్‌కు ముందు మేకర్స్‌ చేసిన హడావుడితో ఈ సినిమాపై మంచి హైపే క్రియేట్‌ అయింది. చిత్రం రిలీజయ్యాక తెలిసిన కథలనే శ్రీవాస్‌ మిక్సీలో వేసి రుబ్బాడని విమర్శలు వచ్చాయి. ఈ సినిమాకు రూ.15 కోట్ల వరకు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. ఫైనల్‌ రన్‌లో ఇందులో పావు వంతు షేర్‌ను కూడా సాధించలేక డిజాస్టర్‌గా మిగిలింది.

Read more RELATED
Recommended to you

Latest news