అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్‌.. మ‌రిన్ని సీన్ల‌తో మ‌ళ్లీ వ‌స్తోంది..!

-

అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ మూవీలో కొన్ని అద‌న‌పు స‌న్నివేశాల‌ను జోడించి ఆ సినిమాను ఈ నెల 28వ తేదీ నుంచి మ‌ళ్లీ థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఆ సీన్ల‌లో అభిమానుల‌కు కొన్ని స‌ర్‌ప్రైజ్‌లు ఉంటాయ‌ని మార్వెల్ స్టూడియోస్ చెబుతోంది.

మార్వెల్ స్టూడియోస్ నిర్మాణంలో వ‌చ్చిన అవెంజ‌ర్స్ సిరీస్‌లోని ఆఖ‌రి చిత్రం.. అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఆ దిశ‌గా సినిమా రిలీజ‌య్యాక బాక్సాఫీసు రికార్డుల‌ను ఆ మూవీ బ‌ద్ద‌లు కొట్టింది కూడా. అన్ని భాష‌ల‌కు చెందిన సినీ ప్రేక్ష‌కులు అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ చిత్రాన్ని ఆదరించారు. దీంతో ఈ మూవీ ఇప్ప‌టి వ‌రకు దాదాపుగా 2.743 బిలియ‌న్ డాల‌ర్ల‌ను వ‌సూలు చేసింద‌ని సినీ ట్రేడ్ విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే త్వ‌ర‌లోనే ఈ సినిమాలో మ‌రిన్ని సీన్లను జోడించి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ మూవీలో కొన్ని అద‌న‌పు స‌న్నివేశాల‌ను జోడించి ఆ సినిమాను ఈ నెల 28వ తేదీ నుంచి మ‌ళ్లీ థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఆ సీన్ల‌లో అభిమానుల‌కు కొన్ని స‌ర్‌ప్రైజ్‌లు ఉంటాయ‌ని మార్వెల్ స్టూడియోస్ చెబుతోంది. ప‌లు డిలీట్ చేయ‌బ‌డిన స‌న్నివేశాల‌తోపాటు కొన్ని ఎండ్ క్రెడిట్ సీన్ల‌ను కూడా సినిమాలో జోడిస్తున్నామ‌ని చిత్ర నిర్మాత‌లు చెబుతున్నారు.

ఈ క్ర‌మంలోనే సినిమాలో అద‌న‌పంగా క‌ల‌ప‌బ‌డిన స‌న్నివేశాల‌ను ఈ నెల 28వ తేదీ నుంచి చూడ‌వ‌చ్చ‌ని మార్వెల్ స్టూడియోస్ చెబుతోంది. అయితే ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల సినిమాకు మ‌రిన్ని వ‌సూళ్లు వ‌స్తాయ‌ని చిత్ర నిర్మాత‌లు భావిస్తున్నారు. దీంతో అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన చిత్రం అవ‌తార్ (2.788 బిలియ‌న్ డాల‌ర్లు) క‌న్నా ముందుకు వెళ్లాల‌ని వారి ల‌క్ష్యం. మ‌రి అవ‌తార్ రికార్డును అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ బ‌ద్ద‌లు కొడుతుందా, లేదా అనే విష‌యం.. వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version