అవెంజర్స్ ఎండ్ గేమ్ రివ్యూ & రేటింగ్

-

ప్రపంచవ్యాప్తంగా అవెంజర్స్ సీరీస్ లకి సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. సూపర్ హీరోస్ అందరు కలిసి నటించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకుంది. మార్వెల్ స్టూడియోస్ నుండి అవెంజర్స్ సీరీస్ లో ఎండ్ పార్ట్ గా వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ కు కొనసాగింపుగా అవెంజర్స్ ఎండ్ గేమ్ కథ కొనసాగుతుంది. ఇన్ఫినిటీ స్టోన్స్ ను చేజిక్కించుకున్న థానోస్ వాటి శక్తి వల్ల విశ్వాన్ని సగం వరకు నాశనం చేస్తాడు. థానోస్ దాడి వల్ల భూమిపై ఉండే ఎంతోమంది ప్రజలతో పాటుగా అవెంజర్స్ టీం సభ్యుల్లో కొందరు చనిపోతారు. ఇంత విధ్వంసం సృష్టించిన థానోస్ ను థోర్ చంపేస్తాడు. అయితే థానోస్ బారి నుండి ప్రజల్ని రక్షించాలన్న ఆలోచనతో అవెంజర్స్ టీం క్వాంటం రిలేమ్ ద్వారా టైం మిషన్ సాయంతో కాలగమనంలో వెనక్కి వెళ్లి వారు కోల్పోయిన ఆరు ఇన్ఫినిటీ స్టోన్స్ ను తిరిగి సంపాదిస్తే నాశనమైన విశ్వాన్ని మళ్లీ సృష్టించవచ్చని యాంట్ మెన్ ద్వారా తెలుసుకుంటారు. దాని కోసం అవెంజర్స్ టీం ఏం చేశారు. ఆ ఇన్ ఫినిటీ స్టోన్స్ సంపాదించే ప్రయత్నంలో వారు ఎన్ని చిక్కుల్లో పడ్డారు. థానోస్ వర్సెస్ సూపర్ హీరోస్ మధ్య జరిగే యుద్ధంలో ఎవరు గెలిచారు అన్నది సినిమా కథ.

ఎలా ఉందంటే :

సూపర్ హీరోస్ అంతా కలిసి చేసిన ఈ సినిమా అవెంజర్ సీరీస్ లో ఎండ్ పార్ట్ కాబట్టి ఆ అంచనాలకు తగినట్టుగానే కథతో మిరుమెట్లు గొలిపే కథనంతో నడిపించారు. యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ సినిమా మొత్తం ఔరా అనిపించే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సినిమాలో కొంత కామెడీ కూడా నడిపించారు.

మార్వెల్ సీరీస్ లను ఇష్టపడే వారికి ఈ సినిమా కన్నుల పండుగగా అనిపిస్తుంది. సినిమా మొదలైన దగ్గర నుండి ప్రతి ఒక్క సీన్ ఒకదానికి మించి మరొకటి ఉంటుంది. ఎమోషనల్ గా కూడా ఈ సినిమా చాలా బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఇక విశ్వ నాశనం.. యాక్షన్ సీన్స్ అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ పనితీరు ఆకట్టుకుంది.

సినిమా మొత్తం ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్తుంది. అవెంజర్స్ ఎండ్ గేం టైటిల్ కు తగినట్టుగానే ఈ సినిమాతో మంచి ముగింపు ఇచ్చారు. కథతో పాటుగా ఆడియెన్స్ ను మెప్పించేలా విజువల్ గ్రాండియర్ గా సినిమా ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది.

ఎలా చేశారు :

సినిమాలో నటించిన సూపర్ హీరోస్ అంతా అదరగొట్టారు. అయితే థానోస్ గా నటించిన జోష్ బ్రోలిన్ నటన ఆకట్టుకుంది. అతనికి రానా తెలుగు డబ్బింగ్ బాగా సూట్ అయ్యింది. సూపర్ హీరోస్ గా నటించిన రాబర్ట్ డౌనీ, జూనియర్ క్రిస్, ఎవాన్స్ క్రిస్, ఎమ్స్వర్త్ మార్క్ రఫెలో, స్కార్లెట్ జాన్సన్. బ్రై లాంసర్, జెరెమీ రన్నర్, డాన్ చేడేల్, పాల్ రాడ్, కరెన్ గిల్లెన్ ఇలా 22 మంది సూపర్ హీరోస్ ఎవరికి వారు అదరగొట్టేశారు.

టెక్నికల్ గా ఈ సినిమా ఓ అద్భుతమని చెప్పొచ్చు. నాలుగు టైం పిరియడ్స్ చూపించడంలో సక్సెస్ అయ్యారు. సినిమా మొత్తం విజువల్ గ్రాండియర్ గా అనిపిస్తుంది. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క టెక్నిషియన్ గర్వంగా ఫీల్ అయ్యేలా ఉంటుంది.

ప్లస్ పాయింట్స్ :

విజువల్ గ్రాండియర్

సూపర్ హీరోస్

థానూస్

గ్రాఫిక్స్

మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

చెప్పుకోడానికి ఏమి లేవు

బాటం లైన్ :

అవెంజర్స్ ఎండ్ గేమ్.. విజువల్ వండర్..!

రేటింగ్ : 4/5

avengers-end-game-review-rating-marvel-studios

Read more RELATED
Recommended to you

Latest news