కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో వీళ్లే కీలకం.. ఈ నాయకులు ఎవరికి మద్దతిస్తే వాళ్లే అధికారంలోకి..!

-

ఈ పార్టీలు డిసైడ్ చేసే అభ్యర్థే ప్రధాని కూడా అయ్యే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నా… బీజేపీ అధికారంలోకి రావాలన్నా.. ఈ ఆరు పార్టీలతో చేతులు కలపాల్సిందే. ఈ ఆరు పార్టీలు ఎవరినైతే ప్రధాని అభ్యర్థిని నిలబెడతాయో.. ఆ వ్యక్తినే ప్రధాని చేయాల్సి కూడా రావచ్చు. ఏమో.. చెప్పలేం.

జగమెరిగిన సత్యం ఏంటంటే.. ఈ లోక్ సభ ఎన్నికల్లో అటు బీజేపీకి గానీ… ఇటు కాంగ్రెస్ కు గానీ… మ్యాజిక్ ఫిగర్ వచ్చే చాన్సే లేదట. రాజకీయ విశ్లేషకులు బల్ల గుద్ది మీర చెబుతున్న మాట ఇది. అంటే.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు.. కాంగ్రెస్ కూడా చేయలేదు. రెండు పార్టీలు ఎలాగూ కలవవు.. కాబట్టి ఆ సైడ్ ఆలోచించాల్సిన పనే లేదు.

ఇప్పుడు ఉన్న ఆశ ఆ ఆరు ప్రాంతీయ పార్టీల మీదే. అవును… రెండు జాతీయ పార్టీల్లో ఏదో ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఆ ఆరు ప్రాంతీయ పార్టీలే ప్రముఖ పాత్ర పోషించనున్నాయి. ఐదు రాష్ట్రాలకు చెందిన ఆ ఆరు ప్రాంతీయ పార్టీలదే రాబోయే కాలం. ఆ ఆరు ప్రాంతీయ పార్టీలేవో మీకు ఇప్పటికే ఓ ఐడియా వచ్చి ఉంటుంది. అవి మరేవో కాదు.. సౌత్ ఇండియాలోని తెలంగాణ నుంచి టీఆర్ఎస్, ఏపీ నుంచి వైఎస్సార్సీపీ, నార్త్ ఇండియా నుంచి ఉత్తర ప్రదేశ్ లోని రెండు పార్టీలు సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ, ఈస్ట్ ఇండియాలో వెస్ట్ బెంగాల్ నుంచి తృణముల్ కాంగ్రెస్, ఒడిశా నుంచి బీజేడీ. ఈ పార్టీలే ఇప్పుడ దేశాన్ని శాసించబోయేది.

ఈ పార్టీలు డిసైడ్ చేసే అభ్యర్థే ప్రధాని కూడా అయ్యే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నా… బీజేపీ అధికారంలోకి రావాలన్నా.. ఈ ఆరు పార్టీలతో చేతులు కలపాల్సిందే. ఈ ఆరు పార్టీలు ఎవరినైతే ప్రధాని అభ్యర్థిని నిలబెడతాయో.. ఆ వ్యక్తినే ప్రధాని చేయాల్సి కూడా రావచ్చు. ఏమో.. చెప్పలేం.

ఈ పార్టీల గెలిచే ఎంపీ అభ్యర్థులందరినీ కలిపితే 20 శాతం సీట్లు అవుతాయట. అంటే… మిగితా 80 శాతంలో కాంగ్రెస్, బీజేపీ, ఇతర చిన్న చిన్న పార్టీలు ఉంటాయి. ఈ 20 శాతం కలిస్తేనే ప్రభుత్వం ఏర్పాటు. లేదంటే లేదు. అయితే.. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి.. అసలు.. ఈ పార్టీలన్నీ కలుస్తాయా? ఎస్.. తప్పకుండా కలుస్తాయి. ఈ పార్టీలన్నీ కలిస్తే.. కేంద్రం ప్రభుత్వంలో చక్రం తిప్పొచ్చు అంటూ ఎవరు ఊరుకుంటారు చెప్పండి..

ఇప్పటికే తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు, ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కలిసిపోయారు. అది బహిరంగ రహస్యమే. ఆ రెండు పార్టీలు కలిపి తెలంగాణ, ఏపీలో 30 నుంచి 35 సీట్లు గెలుస్తామని ధీమాగా ఉన్నారు. ఆ రెండు పార్టీలు కూడా కలిసే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషిస్తాయని తెలిపాయి. సో.. టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ కలవడం అనేది సమస్య కానే కాదు.

ఇకపోతే.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. ఎలాగూ తెలంగాణ సీఎం కేసీఆర్ దోస్తే. ఒకసారి నవీన్ ను కేసీఆర్ కలిసి కూడా వచ్చారు. నవీన్ పట్నాయక్ కు 21 సీట్లలో 14 నుంచి 15 సీట్లు కన్ఫమ్. ఆయన కూడా వీళ్లతో కలవడానికి పెద్దగా సమస్యలు సృష్టించరు.

ఇక మిగిలిన ముఖ్యమైన రాష్ట్రాలు అంటే ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్. బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్ పార్టీకి 34 సీట్లు ఖచ్చితంగా వస్తాయట. మమత.. కాస్త అటూ ఇటూ బెనికినట్టు కనిపించినా.. చివరకు ఆమె ప్రాంతీయ పార్టీలతో కలిసి పోవాల్సిందే. అయితే.. ఆమె బీజేపీతో పొత్తు పెట్టుకునే చాన్స్ అయితే లేదు. కాకపోతే.. ఆమె మనసు కాంగ్రెస్ వైపుకు మళ్లిందా? అన్న అనుమానాలు కొన్ని రోజుల కింద ఉండే. కానీ.. ఇప్పుడు ఆమె బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వమే కేంద్రంలో ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి.. ఆమె కూడా వీళ్లతో సై అనాల్సిందే.

ఇక మిగిలింది.. అసలు సిసలు రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇదే కేంద్రంలో అధికారంలోకి రాబోయే పార్టీని నిర్ణయించేది. యూపీలో 82 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఎలాగూ ఎస్పీ, బీఎస్పీ కలిసిపోయారు కాబట్టి.. వీళ్లిద్దరూ కలిసి కనీసం 40 అయినా గెలుస్తారు అని తెలుస్తోంది.

మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు. అయితే.. ఇక్కడ మూడు సందర్భాలను మనం పరిశీలిస్తే…

ఒకవేళ ఎన్డీఏకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అన్ని సీట్లు రాకపోయినా… అటూ ఇటూ ఉంటే.. ఏదో ఒక పార్టీ మద్దతు ఇచ్చినా నెగ్గుకు రాగలిగే చాన్స్ ఉంటే.. ఈ ఆరు పార్టీల్లో ఏదో ఒక పార్టీ ఎన్టీఏలో కలిసిపోతుంది. దీంతో ప్రాబ్లమ్ సాల్వ్. మిగితా ప్రాంతీయ పార్టీలతో పనిలేకుండా బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. సో.. మళ్లీ ప్రధాని మోదీయే అవుతారు.

ఒకవేళ బీజేపీకి 200 సీట్లు కూడా రాకపోతే… అప్పుడు ఈ పార్టీలన్నీ కలిసి యూపీఏకు మద్దతు ప్రకటించవచ్చు. అప్పుడు ఈ పార్టీలు చెప్పినట్టు యూపీఏ వినాల్సిందే.

ఈ ఆరు పార్టీలు ఒక ఫ్రంట్ ను ఏర్పాటు చేసి.. ఏదో ఒక జాతీయ పార్టీకి మద్దతు ఇస్తే… అప్పుడు 1990లో జరిగిందే మళ్లీ రిపీట్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news