చిలుకను అరెస్ట్ చేసి జైలులో పెట్టిన పోలీసులు.. ఎందుకో తెలిస్తే మీరు నోరెళ్లబెట్టాల్సిందే..!

-

బ్రెజిల్ లో స్మగ్లింగ్ ఎక్కువ. స్మగ్లింగ్ చేసే గ్యాంగ్ కోసం పోలీసులు కూడా అహోరాత్రులు గాలిస్తున్నారు. ఒకరోజు… ఓ ఇంట్లో భారీ మొత్తంలో కొకైన్ ను సరఫరా చేస్తున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. డైరెక్ట్ గా ఆ ఇంటికి వెళ్లి స్మగ్లింగ్ గ్యాంగ్ ను పట్టుకోవాలనేది పోలీసుల ప్లాన్.

జంతువులను, పక్షులను ఎవరన్నా అరెస్ట్ చేస్తారా? అవేమన్నా మనుషులా అరెస్ట్ చేయడానికి అంటూ తిట్టేయకండి. ఎందుకంటే.. మీరు చదివిన టైటిల్ నిజమే. చిలుకను పోలీసులు అరెస్ట్ చేశారు. దాన్ని జైలులో కూడా బంధించారు. దానికి కారణం అది నేరస్థులకు సాయం చేయడమే. అవును.. ఈ ఘటన బ్రెజిల్ లో చోటు చేసుకున్నది.

police arrest parrot and put it in jail in brazil

ఇదంతా ఓ సినిమా స్టోరీలా ఉంటుంది. మనం కూడా సినిమాటిక్ గానే చదువుకుందాం పదండి.. బ్రెజిల్ లో స్మగ్లింగ్ ఎక్కువ. స్మగ్లింగ్ చేసే గ్యాంగ్ కోసం పోలీసులు కూడా అహోరాత్రులు గాలిస్తుంటారు. ఒకరోజు… ఓ ఇంట్లో భారీ మొత్తంలో కొకైన్ ను సరఫరా చేస్తున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. డైరెక్ట్ గా ఆ ఇంటికి వెళ్లి స్మగ్లింగ్ గ్యాంగ్ ను పట్టుకోవాలనేది పోలీసుల ప్లాన్. దాని ప్రకారమే.. ఆ ఇంటి సమీపంలోకి చేరుకున్నారు. లోపల స్మగ్లింగ్ దందా జరుగుతూనే ఉన్నది. గ్యాంగ్ సభ్యులు కూడా ఉన్నారు.

పోలీసులు నెమ్మదిగా ఆ ఇంటిని చుట్టుముట్టడం మొదలు పెట్టారు. అప్పుడే… ఆ ఇంటి గుమ్మం ముందు పంజరంలో ఉన్న ఓ చిలుక పోలీసులు చుట్టుముట్టిన విషయాన్ని పసిగట్టింది. వెంటనే పోలీస్.. పోలీస్ అంటూ అరిచింది(చిలుకలు మాట్లాడుతాయంటారు కదా). అంతే.. వెంటనే దొడ్డి దారి గుండా స్మగ్లర్లు అందరూ జంప్. ఒక్కడు కూడా లేకుండా అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు లోపలికి వెళ్లి చేస్తూ అక్కడ ఒక్కడూ లేడు. చిలుక అరవడం వల్లనే ఆ దుండగులు పారిపోయారని తెలుసుకున్న పోలీసులు.. చేసేదేమి లేక.. ఆ చిలకను అరెస్ట్ చేశారు. నేరస్థులకు అది సహకరించిందని.. దాన్ని అరెస్ట్ చేయడంతో పాటు జైలులో నిర్భందించారు.

అరెస్ట్ చేసిన తర్వాత దాన్ని విచారించారట. అప్పుడు చిలుక నోరు మెదపలేదట. ఇక.. చిలుకను పోలీసులు నిర్భందించారని తెలుసుకున్న పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు.. ఆ చిలుకను వదిలిపెట్టాలంటూ నిరసనలు చేయడం మొదలు పెట్టారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని జూకు తరలించారు.

బ్రెజిల్ లో డ్రగ్స్ ముఠా జంతువులు, పక్షులను తమ అవసరాల కోసం ఉపయోగించుకోవడం చాలా కామన్. కాకపోతే.. ఇలా చిలుకలను ఉపయోగించుకొని అప్రమత్తం అవ్వడం మాత్రం ఇదే మొదటిసారి అంటూ ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. దానికి శిక్షణ ఇచ్చి మీర.. వాళ్లకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుకుంటారట స్మగ్లర్స్. అది చిలుక కథ.

Read more RELATED
Recommended to you

Latest news