తొలిరోజు 750 కోట్లు.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న అవెంజర్స్..!

-

అవెంజర్స్ సీరీస్ లో చివరిగా మార్వెల్ స్టూడియోస్ నుండి వచ్చిన సినిమా అవెజ్ఞర్స్ ఎండ్ గేమ్. సూపర్ హీరోస్ అందరు కలిసి నటించిన ఈ సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఇండియన్ సిని లవర్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురుచూశారు. శుక్రవారం రిలీజైన ఈ సినిమా తొలిరోజు వరల్డ్ వైడ్ గా సంచలన వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది. రెండు రోజుల ముందు రిలీజైన చైనాలో తొలి రోజు 750 కోట్లను కలెక్ట్ చేసింది.

చైనాలో లక్ష పైగా థియేటర్స్ ఉండగా అందులో సగానికి పైగా అవెంజర్స్ ఎండ్ గేం ను రిలీజ్ చేశారు. ఇక నిన్న రిలీజైన ఇండియా, అమెరికా, కెనెడా వంటి ప్రదేశాల్లో ఎంత కలెక్ట్ చేసింది అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఇండియాలోనే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. అంతకుముందు అవతార ఫుల్ రన్ లో 2.7 బిలియన్ డాలర్స్ అంటే దాదాపు 18.8 వేల కోట్లు వసూళు చేసింది. అవెంజర్స్ ఎండ్ గేం 3 బిలియన్ డాలర్స్ తో అవతార్ రికార్డులను బద్ధలు కొట్టేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news