వీళ్లపై గత సంవత్సరం సెప్టెంబర్ 18న పీడీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. వీళ్లు ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్నారు. రెండు నెలల క్రితమే వీళ్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా… అప్పుడు వీళ్లకు హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య తెలుసు కదా. తన కూతురును పెళ్లి చేసుకున్నాడని.. పెరుమాళ్ల ప్రణయ్ అనే యువకుడిని అమృత తండ్రి కిరాయి హంతకులతో చంపించిన విషయం తెలిసిందే. ప్రణయ్ హత్య కేసులో నిందితులుగా ఉన్న తిరునగరు మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్ కుమార్, మరో వ్యక్తి ఖరీంలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
వీళ్లపై గత సంవత్సరం సెప్టెంబర్ 18న పీడీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. వీళ్లు ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్నారు. రెండు నెలల క్రితమే వీళ్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా… అప్పుడు వీళ్లకు హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు. నిందితులకు బెయిల్ ఇవ్వకూడదని జిల్లా ఎస్పీ రంగనాథ్, మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్ నొక్కి చెప్పారు.
అయితే.. తమకు బెయిల్ కావాలంటూ వీళ్లు మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ ప్రారంభించిన కోర్టు.. ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో వాళ్లను త్వరలోనే బెయిల్ పై విడుదల చేసే అవకాశం ఉంది.