Big Boss Non Stop: సీక్రెట్ టాస్క్‌లో సత్తా చాటిన నటరాజ్..మరి కెప్టెన్సీలో ఎవరు మాస్టర్?

-

‘బిగ్ బాస్’ ఓటీటీ తెలుగు షోలో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్ మాస్టర్ ఎంటర్ టైన్మెంట్ కా బాప్ గా మారి..బీబీ లవర్స్, ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఇక హౌజ్ లో కంటెస్టెంట్ గా ఉన్న నటరాజ్ మాస్టర్ సైతం తన దైన శైలిలో కామెడీ , పంచ్ డైలాగ్స్ చెప్తూ ముందుకు సాగుతున్నారు.

ఇక ‘బిగ్ బాస్’ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ‘కిల్లర్’లో నటరాజ్ మాస్టర్ ఇరగదీశారు. కానీ, కెప్టెన్స్ కంటెండర్ గా మాత్రమే ఉండిపోయారు. కెప్టెన్సీ దక్కించుకోలేకపోయారు. బాబా భాస్కర్ మాస్టర్ బుధవారం ఎపిసోడ్ లో కెప్టెన్ అయిపోయారు. ఈ సందర్భంగా బాబా మాస్టర్ ‘‘ఎప్పుడొచ్చామన్నది కాదు అన్నయ్యా..కెప్టెన్ అయ్యామా? లేదా?’’ అనే డైలాగ్ చెప్పి బీబీ లవర్స్ ను, కంటెస్టెంట్స్ నూ ఎంటర్ టైన్ చేశాడు.

బిగ్ బాస్ హౌజ్ మేట్స్ అందరూ కూడా బాబా మాస్టర్ చేసే కామెడీకి ఫిదా అయిపోతున్నారు. అఖిల్ తప్ప దాదాపుగా అందరూ కంటెస్టెంట్స్ అవసరమైనపుడు బాబా మాస్టర్ ను పొగిడేస్తున్నారు. కాగా, బాబా మాస్టర్ కెప్టెన్సీలో గేమ్‌లో ఇక నవ్వులు నవ్వూలే పూయననున్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు, బీబీ లవర్స్ చర్చించుకుంటున్నారు. మొత్తంగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ‘బిగ్ బాస్’ ఇంటికి వచ్చిన బాబా మాస్టర్..తనదైన శైలిలో దూసుకుపోతున్నారనే చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news