వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు.. నేటి నుంచి ఎంతంటే…!

-

200 రూపాయలతో ప్రారంభమై వైస్ జగన్ పుణ్యమా అని ఇప్పుడు 3000 రూపాయలకు చేరుకుంది ఏపీలో వృద్ధాప్య పెన్షన్. చివరి దశలో ఉన్న వృద్దులు ఒకరిపై ఆధారపడకుండా వారి ఖర్చులకు సరిపడా నెలవారీ ఖర్చుల కోసం పెన్షన్ అందిస్తోంది ఏపీ సర్కారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పెన్షన్ ను 200 కి పెంచారు. 75 రూపాయలను 200కి పెంచి ఆయన దేవుడు అయ్యారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని పదింతలు చేసి అవ్వా తాత లకు అందిస్తున్నారు సీఎం జగన్.

అన్ని రకాల ధరలు పెరిగిన నేపథ్యంలో 2019 ఎన్నికల సమయంలో పెన్షన్ ను 3 వేల వరకు పెంచుకుంటూ పోతామని చెప్పారు జగన్ మొహన్రెడ్డి. అదే హామీని ఇప్పుడు నిలబెట్టుకుంటు వరుసగా 5వ ఏడాది పెంచిన ప్రకారం పెన్షన్ అందించేందుకు సిద్ధమయ్యారు సీఎం జగన్. కొత్త సంవత్సరం నేపథ్యంలో పెన్షన్ రూ.3వేలకు పెంచి నేటి నుంచి ప్రతి అవ్వా తాతలకు అందిస్తున్నారు. విశ్వసనీయతకు అర్థం చెబుతూ, మానవత్వానికి ప్రతిరూపంగా, పెన్షన్లను క్రమంగా రూ.3వేలకు పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని సంపూర్ణంగా నెరవేరుస్తున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెరిగిన పెన్షన్ వివరాలు ఇలా ఉన్నాయి

  • 2014-19లో గత పాలనలో పెన్షన్‌ రూ.1000
  •  జులై 2019 నుంచి పెన్షన్‌ను రూ.2,250లకు పెంపు.
  •  జనవరి 2022న రూ.2,500కు పెన్షన్‌ పెంపు.
  •  జనవరి 2023న రూ. 2,750కు పెంపు.
  •  జనవరి 2024న రూ.3వేలకు పెంపు.

పెన్షన్లపై నెలవారీ సగటు వ్యయం రూ.400 కోట్ల నుంచి రూ.1968 కోట్లకు పెరిగింది.2014-19 మధ్య గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్లపై సగటున వ్యయం రూ.400కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక జులై 2019 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1384 కోట్లుగా మారింది.జనవరి 2022 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1570 కోట్లు, 2023 జనవరి నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,776 కోట్లు అయింది. తాజాగా 2024 జనవరి నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1968 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు.

గత ప్రభుత్వం ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కేవలం నెలకు రూ.1000 చొప్పున, ఎన్నికలకు 6 నెలల ముందు వరకూ 39 లక్షల మందికి సగటున ఖర్చుచేసిన మొత్తం నెలకు రూ.400 కోట్లు మాత్రమే. 5 ఏళ్లలో అంటే 60 నెలల్లో గత ప్రభుత్వం పెన్షనర్లకు చేసిన ఖర్చు రూ.27,687 కోట్లు మాత్రమే. ఇచ్చిన మాట ప్రకారం వైసీపీ ప్రభుత్వం నెలకు రూ.300 చొప్పున 66.34 లక్షల మందికి నెలకు సగటున చేస్తున్న ఖర్చు రూ.1968 కోట్లు. గడచిన 55 నెలల్లో జగనన్న ప్రభుత్వం పెన్షన్లపై రూ.83,526 కోట్లు ఖర్చు చేసింది. పెన్షన్‌ లబ్ధిదారులు గత ప్రభుత్వ పాలనలో 39 లక్షలు ఉంటే వైఎస్ జగన్ సీఎం అయ్యాక 66.34లక్షలకు పెరిగారు.

పెన్షన్ల విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను చూసుకుంటే…:

గత పాలనలో పింఛన్‌కోసం వృద్ధులు, వికలాంగులు చాంతాడంత క్యూలో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా 2.6లక్షల గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఠంచన్‌గా ప్రతినెలా ఒకటో తేదీన పొద్దు పొడవక ముందే తలుపుతట్టి గుండ్ మార్నింగ్‌ చెప్పి మరీ చిరునవ్వుతో లబ్ధిదారుల గడప వద్దనే పెన్షన్ల్లు అందిస్తున్నారు. సెలవు, పండుగ రోజులు అయినా పెన్షన్లను అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపడంలేదు సీఎం జగన్.

గత ప్రభుత్వ పాలనలో పింఛన్ల మంజూరులో లంచాలు, వివక్ష, వీలైనంతమందికి లబ్ధి ఎలా ఎగ్గొట్టాలా అన్న కుతంత్రాలు, గ్రామానికి ఇంతమందికే లబ్ధి అనే గిరి గీసేవారు. ఎవరైనా చనిపోతేనే కొత్తవారికి అవకాశం వచ్చేది. తమ వర్గం, తమ పార్టీ, తమ వారికే పెన్షన్లు ఇచ్చే ధోరణి ఉండేది. అందులోనూ జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తేనే వృద్ధులు, వికలాంగులు, అనే కనికరం కూడా లేకుండా వారికిచ్చే పెన్షన్లలో వాటా కొట్టేసేలా గత పాలన నడిచింది.

నేడు ఆ పరిస్థితులు మారాయి. కుల, మత వర్గ, పార్టీలకు అతీతంగా లంచాలు, వివక్ష, అశ్రిత పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తున్నారు జగనన్న.అర్హులై ఉండి ఒకవేళ ఏ కారణంచేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశాన్ని ఇస్తూ ప్రతి ఏటా జూన్‌, డిసెంబర్‌లలో బై యాన్యువల్‌ శాంక్షన్ల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నారు.

ఇవీ లబ్దిపొందిన వారి వివరాలను ఓసారి పరిశీలిస్తే… 2014-19 మధ్య వృద్ధాప్య, వితంతు మరియు ఒంటరి మహిళల పెన్షన్‌ కేటగిరీలొ ఒక్కో లబ్ధిదారుడు పొందిన మొత్తం రూ.58,000 మాత్రమే. ల్ వైసీపీ ప్రభుత్వంలో వృద్ధాప్య, వితంతు మరియు ఒంటరి మహిళల పెన్షన్‌ కేటగిరీలో ఒక్కో లబ్ధిదారునికి అందించిన లేదా అందిస్తున్న మొత్తం రూ.1,47,500. గత ప్రభుత్వంలో కంటే రూ.89,500 అదనంగా ప్రతిఒక్కరు లబ్ది పొందుతున్నారు.గత ప్రభుత్వంలో వికలాంగుల పెన్షన్‌ అందుకున్న ఒక్కో లబ్ధిదారుడికీ 5 ఏళ్లలో అందిన లబ్ధి కేవలం రూ.58,500. కానీ ఇప్పుడు జగన్ పాలనలో వికలాంగుల పెన్షన్‌ అందుకున్న ఒక్కో లబ్ధిదారుడికీ అందించిన లేదా అందిస్తున్న లబ్ధి రూ.1,82,000. గతం కంటే ఇది రూ.1,23,500 అదనం.

ఇచ్చిన మాటపై అంతగా కట్టుబడి హామీని నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదే అవకాశంగా భావించిన ప్రతిపక్షం అమలు సాధ్యం కాని హామీలను గుప్పిస్తున్నారు. ఈ హామీలను చూసి అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా అని ప్రతిపక్షాన్ని నిలదీస్తున్నారు.మాటను నిలబెట్టుకున్న జగన్ అన్నపై ఆత్మాభిమానం పెంచుకున్నారు ఏపీ ప్రజలు. అందుకే పక్క రాష్ట్రాల ప్రజలు సైతం ఇప్పుడు జగనన్న లాంటి సీఎం కావాలని కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news