ఫేస్‌బుక్‌ను ఊపేస్తున్న బాహుబ‌లి.. ఇదేం ఫాలోయింగ్ బాబోయ్‌!

ప్ర‌భాస్ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్‌గా అవ‌త‌రించాడు. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ప్ర‌భాస్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఆయ‌న ఎప్పుడూ పెద్ద‌గా సోష‌ల్ మీడియాలో క‌నిపించ‌రు. ఆయన పర్సనల్ అప్డేట్స్ కూడా మ‌న‌కు వెతికితే తప్ప పెద్ద‌గా ఎక్క‌డా కనిపించవ‌నే చెప్పాలి. కానీ ఆయ‌న సోషల్ మీడియా కింగ్ అనే చెప్పాలి. ఈ క్రెడిబిలిటీ తోనే ఆయ‌న ఫేస్‌బుక్‌ను ఊపేస్తున్నారు.

 

టాలీవుడ్‌లోని మిగతా హీరోల కంటే ప్ర‌భాస్ చాలా యూనిక్ స్టయిల్ ని పాలో అవుతున్నారు. దీంతో ఆయ‌న చుట్టూ ఒక రకమైన ఫ్యాన్స్ వేవ్ అల్లుకుంటోంది. ఫేస్ బుక్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భాస్‌కు 23.5 మిలియన్ల ఫాలోవ‌ర్లు ఉన్నారు.

అలాగే ఇప్పుడు తాజాగా ఇన్ స్టా గ్రామ్‌లో ఖాతా తెరిచి ఏకంగా 6మిలియ‌న్ల ఫాలోవ‌ర్ల‌ను సంపాదించారు. దీంతో ఇప్పుడు ఫేస్‌బుక్‌, ఇన్ స్టాగ్రామ్‌లో క‌లిపి 30 మిలియన్లకి చేరుకుంది ఫ్యాన్స్ సునామీ. అయితే ఆయ‌న పాపులర్ సోష‌ల్ మీడియా అయిన ట్విట్టర్ లో అడుగు పెట్ట‌ట్లేదు. చాలా మంది హీరోలు అయితే ట్విట్ట‌ర్ మీద‌నే ఆధార‌ప‌డుతుంటారు. కానీ నార్త్ లో నిలదొక్కుకుంటున్న డార్లింగ్ .. ఇలా ట్విట్ట‌ర్ జోలికి ఎందుకు వెల్ల‌ట్లేద‌నేది ఇక్క‌డ పెద్ద ప్ర‌శ్న‌.