తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి, తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులతో సినీ పెద్దలు జరిపిన చర్చలపై బాలయ్య సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తనను ఎవరూ పిలవలేదు అన్నంతవరకూ బాగానే ఉంది కానీ… “భూములు పంచుకోవడానికా” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఒక్కసారిగా ఇండస్ట్రీలో దుమారం రేపాయి. అనంతరం తగుదునమ్మా అంటూ నాగబాబు చేసిన హడావిడితో ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారిపోయింది. ఈ వ్యవహారామపై బాలయ్య మళ్లీ స్పందించలేదు. నిర్మాత ప్రసన్న కుమార్ లాంటివారు నాగబాబు వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్స్ ఇచ్చారు తప్ప.. బాలయ్య మాత్రం మౌనంగానే ఉన్నారు. ఈ క్రమంలో ఓ వెబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై బాలయ్య తనదైన శైలిలో స్పందించారు.
చిరంజీవి, నాగార్జున మిమ్మల్ని పిలవలేదంటారా? ఈ విషయంలో నాగబాబుకు, మీకు కూడా గొడవ జరిగిందిగా అన్న ప్రశ్నకు.. “నాకేం జరగలేదు. అతనే మాట్లాడుతున్నాడు. నేనెందుకు మాట్లాతాను..’’ అని మొదట్లో కాస్త శాంతంగానే స్పందించిన బాలయ్య… నాగబాబు మాటలపై మీరేమైనా మాట్లాడతారా? అనిఅడుగగా మాత్రం కాస్త ఫైరయ్యారు.. “నేనెందుకు మాట్లాడతాను.. అస్సలు మాట్లాడను. ఛీ ఛీ నేను మాట్లాడమేంటి? ఇండస్ట్రీ అంతా ఇవాళ ఆల్మోస్ట్ మనకు సపోర్టింగ్‌గా వస్తున్నప్పుడు ఇంక నేనేం మాట్లాడాలి..” అని బాలయ్య స్పందించార్!
ఇక “గతంతో కేసీఆర్ పై మీరు కొన్ని విమర్శలు చేశారు. అందువల్లే టాలీవుడ్ పెద్దలు మిమ్మల్ని సీఎంతో మీటింగుకు పిలవలేదా”? అని అడిగిన ప్రశ్నకు స్పందించిన బాలయ్య… ఆవిషయం తనకు ముందే చెప్పొచ్చుగా అంటూ మొదలుపెట్టి కేసీఆర్ కు తనకు మద్య ఉన్న సంబందాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. “కేసీఆర్ గారికి నామీదేం కోపం లేదు.. అయినా అవి రాజకీయాలు, రాజకీయ విమర్శలు.. అప్పుడు కేసీఆర్ ను ఎన్నో తిట్ళు తిట్టిన నామా నాగేశ్వరరావుగారిని పార్టీలో జాయిన్ చేసుకోలా? రాజకీయాలు వేరండి. అందుకే అనేది హిపోక్రసి, సైకోఫాన్సీ అని.. కేసీఆర్ గారికి అటువంటిది ఏమీ లేదు.. రామారావుగారి అభిమాని ఆయన.. నేనంటే పుత్రవాత్సల్యం ఉంది ఆయనకి.. అటువంటిది ఏమీ లేదు.. నన్ను వేరేగా చూస్తే మాత్రం నాకు తిక్కరేగుద్ది.. ఎందుకు పిలవలేదో నాకు తెలియదు” అని స్పందించారు!