బాలయ్యకే తప్పలేదు… ఇంకెంత మంది ఉన్నారో!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వర్గాలు, గ్రూపులూ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయనేది చాలా మంది చెప్పే మాట! అయితే ఈ విషయంలో ఏదైనా వ్యవహారం బయటకు వస్తే మాత్రం వెంటనే సినీ పెద్దలు అనబడేవారిలో ఎవరొకరు మైకందుకుని… “ఇండస్ట్రీ అంతా ఒక్కటే, ఇక్కడ ఎలాంటి గ్రూపులు లేవు” అని చెప్పేస్తుంటారు. ఇది సినీపరిశ్రమలో రొటీన్ గా జరిగే వ్యవహారమే! ఇండస్ట్రీ కొంతమంది పెద్దల చేతిలోనే ఉందని.. థియేటర్లు ఆ నలుగురి చేతిలోనే ఉన్నాయని నిత్యం వినిపించే విమర్శల సంగతి కాసేపు పక్కన పెడితే… గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వంతో సినీ పెద్దలు జరుపుతున్న చర్చల విషయంలో బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు! ఇది బాలయ్య ఒక్కరి బాదేనా.. లేక బాలయ్య లాంటివారు ఇంకా ఉన్నారా అనేది చూడాలి!

షూటింగులు మొదలు పెట్టే విషయంపై సీఎం కేసీఆర్‌ ను సినీ ఇండస్ట్రీ పెద్దలు కలిసి చర్చించిన విషయం తనకు తెలీదని.. ఈ సమావేశానికి రావాలని తనను ఏ ఒక్కరూ పిలవలేదని బాలయ్య షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి! ఇదే క్రమంలో అటు ఇండస్ట్రీలోనూ ఈ విషయంపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి! సినీ పెద్దలు అనబడేవారు బాలయ్యను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, సినీ ఇండస్ట్రీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ బాద, ఆవేదన ఒక్క బాలయ్యది మాత్రమే కాదనేది సినీ విశ్లేషకులు చెబుతున్న మాట! ఈ బాద చాలా మంది సినీ జానాల్లో ఉందని.. కాకపోతే బాలయ్య దైర్యం చేసి స్పందించారని చెబుతున్నారు!

అయితే… ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారే సూచన్లు ఉండేసరికి బాలకృష్ణ వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ తాజాగా‌ స్పందించారు! ప్రస్తుతం నిర్మాతలుగా తామంతా చిత్రీకరణ కోసం ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామని.. బాలకృష్ణ ఇప్పుడు నిర్మాతగా ఏ సినిమా చేయకపోవడం వల్ల నిర్మాతల లిస్టులో ఆయన లేరన్నట్లుగా కళ్యాణ్ స్పందించారు! అవసరమైనప్పుడు బాలయ్య మాతో చర్చల్లో పాల్గొంటారని.. ఇండస్ట్రీ అంతా ఒక్కటే, ఇక్కడ ఎలాంటి గ్రూపులు లేవు అని వ్యాఖ్యానించారు. ఆ సంగతులు అలా ఉంటే… ఈ వ్యవహారంపై బాలయ్య అభిమానులు మాత్రం మహా గుర్రుగా ఉన్నారని సమాచారం!

Read more RELATED
Recommended to you

Latest news