మహేష్ కోసం బాలకృష్ణ వెయిటింగ్..!

-

నందమూరి బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా క్రిష్ డైరక్షన్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఇప్పటికే రానా, కళ్యాణ్ రాం, సుమంత్ లాంటి స్టార్స్ నటిస్తున్నారని తెలిసిందే. సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో మహేష్ కనిపిస్తాడని కొన్నాళ్లుగా వినిపిస్తున్న వార్త. బాలకృష్ణ స్వయంగా మహేష్ తో మాట్లాడటం జరిగింది.

అయితే ఈ సినిమాకు మహేష్ తన అభిప్రాయం చెప్పేందుకు కాస్త టైం అడిగాడట. మహేష్ ఆన్సర్ కోసం ఎన్.టి.ఆర్ యూనిట్ ఎదురుచూస్తుందట. మహేష్ వస్తే కృష్ణ పోర్షన్ కూడా షూట్ చేయాలని చూస్తున్నారట. ప్రస్తుతం మహేష్ అమెరికాలో మహర్షి షూటింగ్ లో ఉన్నాడు. ఎన్.టి.ఆర్, కృష్ణ అప్పట్లో కలిసి సినిమాలు చేశారు. ఎన్.టి.ఆర్ సీనియర్ నటుడైనా ఆయనతో పోటీ పడి మరి సినిమాలు చేసిన ఘనత కృష గారిది.

మరి ఎన్.టి.ఆర్ బయోపిక్ లో కృష్ణ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. కృష్ణ గారిగా మహేష్ నటిస్తే ఎన్.టి.ఆర్ బయోపిక్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుంది. జనవరి 9న రిలీజ్ అవుతున్న ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమాలో కృష్ణ పాత్ర ఉంటుందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news