టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి విజయోత్సాహంతో తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎన్బికె108’ వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న సినిమా బిజీలో ఉన్నారు. ఈ మూవీ దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దీని తర్వాత బాలయ్య కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్‌తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయనున్నారని సమాచారం. ఇది రెండు భాగాలుగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.
తొలి భాగంలో శివ రాజ్‌కుమార్, బాలకృష్ణ కలిసి నటించనుండగా.. రెండో భాగంలో వీరికి మరో స్టార్ కూడా జత కలవనున్నట్లు తెలిసింది. ఇందుకోసం రజనీకాంత్ పేరు పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఆయనకు కుదరకుంటే కమల్‌హాసన్, మమ్ముట్టి, మోహన్లాల్లలో ఒకరిని బరిలోకి దించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు హర్ష దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. దీన్ని శివ రాజ్‌కుమార్ తన సొంత నిర్మాణ సంస్థలో మరో ఇద్దరు కన్నడ నిర్మాతలతో కలిసి నిర్మించనున్నారట.