NBK 108 : గ్యాంగ్ స్టర్‌గా బాలయ్య !

-

ఎఫ్3 తర్వాత బాలయ్యతో అనిల్ రావిపూడి ఎన్బీకె 108 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అఖండ, ఎన్బీకే 107 తర్వాత.. ముచ్చటగా మూడోసారి తమన్ ఈ సినిమాకు సంగీతం అందిచబోతున్నాడు. దాంతో మ్యూజికల్‌గా అంచనాలను పెంచేసింది 108 ప్రాజెక్ట్.

ఇక అంతకు మించి అనేలా ఇందులో బాలయ్య ఊహించని రోల్‌లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ఈ సినిమాలో స్టైలిష్ గ్యాంగ్ స్టర్‌గా కనిపించనున్నారట బాలయ్య. అందుకోసం నటసింహం లుక్ ఓ రేంజ్‌లో డిజైన్ చేసినట్టు సమాచారం.

ఒకవేళ ఇదే నిజమైతే.. స్టైలీష్ గ్యాంగ్ స్టర్‌గా బాలయ్య రూలింగ్ అండ్ యాక్షన్ సీన్స్ అదిరిపోవడం పక్కా అంటున్నారు అభిమానులు. ఇక షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాలో.. యంగ్ బ్యూటీ శ్రీలీల.. బాలయ్య కూతురిగా నటించనుంది. ప్రస్తుతం బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న NBK107 ప్రాజెక్ట్ అయిపోగానే.. 108 ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.

Read more RELATED
Recommended to you

Latest news