గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు నటించిన తాజా చిత్రం వీర సింహారెడ్డి. ఈ సినిమా తాజాగా జనవరి 12న విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల అయి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఎక్కడా చూసినా బాలయ్య సినిమా గురించే చర్చ నడుస్తోంది. మొదటి రోజు వసూళ్ళు కూడా అనుకున్నట్టే అదరగొట్టాయి.
ఇక సినిమాలోని పాటలు సన్నివేశాలు, డైలాగ్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి అని ఫ్యాన్స్ గోల గోల చేస్తున్నారు. ఇక ఈ సినిమా వసూళ్ళు చూసుకుంటే కొద్దిగా చిరంజీవి సినిమా ఉండటం వల్ల కొంచం తగ్గిపోయాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో రూ. 44.50 కోట్లు షేర్, రూ. 73.90 కోట్లు గ్రాస్ వచ్చింది.
అఖండ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో వీర సింహా రెడ్డి’ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగాటార్గెట్ ఇచ్చారు. మూడు రోజుల్లో రూ. 44.50 కోట్లను సొంతం చేసుకుంది. ఇంకా రూ. 29.50 కోట్లు వస్తేనే హిట్ అయ్యే అవకాశం ఉంది. ఇక బాలయ్య ఫ్యాన్స్ కోరుకున్నట్లు బ్లాక్ బస్టర్ హిట్ కావాలంటే మాత్రం మరిన్ని ఎక్కువ వసూళ్లు సాధించాలి. ఈ సారి మాత్రం అఖండ సినిమా మాజిక్ రిపీట్ కాక పోవచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే ఒకేసారి ఐదు సినిమాలు బరిలో ఉన్నాయి కనుక అనే కారణం చూపుతున్నారు.