బాలయ్య బాబు గౌరవం పెరుగుతోందా! తరుగుతోందా.!

-

నందమూరి బాలకృష్ణ అంటే మాస్ కా బాప్,  అభిమానులకు తనని మొన్నటి దాకా థియేటర్స్ లోనే చూసే అవకాశం వుండేది. కాని తాను ప్రస్తుతం టాక్ షో, యాడ్స్ లో కూడా కనిపిస్తూ అలరిస్తున్నాడు. ఇక తన అభిమానులు కాని వారు కూడా ఆహా ఓటిటి లో అన్ స్టాపబుల్ షో  చూసి అందరూ జై బాలయ్య అంటూ గోల గోల చేస్తున్నారు. సీజన్ 1 ఓటిటి లలో రికార్డ్ మోత మోగించింది.

ఇప్పుడు సీజన్ 2 చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్  రిలీజ్ చెస్తే రికార్డ్ వ్యూస్  హల్చల్ చేసింది.  ఈ షోలో తనదైన స్టైల్ లో రాజకీయంగా సినిమా పరంగా ప్రశ్నలు అడగడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. హై రెస్పాన్స్ వల్ల పవన్ కల్యాణ్ కి సంబంధించిన ఈ ఇంటర్వ్యూను రెండు ఎపిసోడ్లుగా గా మార్చారు. మొదటి ఎపిసోడ్ నేషనల్ మీడియాలో కూడా ట్రెండ్ అయ్యాయి.

ఇక ఇదే ఆనందం లో రెండో భాగం ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఇది కూడా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇక ఆనందపడే సందర్భం లో బాలయ్య నోటి మాటలు అసలకే మోసం చేస్తున్నాయి. ఇక పవన్ కల్యాణ్ మూడు పెళ్ళిళ్ళు విడాకుల విషయం మీద తన కామెంట్స్ పై విమర్శలు వచ్చాయి. మరో సారి నర్సుల అందం పై వ్యాఖ్య చేసి మరో సారి నాలుక కరుచుకుని సారీ చెప్పారు. ఇలాగే కొట్టడాలు, పిచ్చి కామెంట్స్ చేస్తూ ఉంటే సీనియర్ హీరో అనే గౌరవం కూడా ఊడి పోయేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news