అక్కినేని-తొక్కనేని మాటలపై స్పందించిన బాలయ్య..అవి ఫ్లోలో వచ్చిన మాటలు !

-

అక్కినేని-తొక్కనేని మాటలపై స్పందించారు టీడీపీ పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ. ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటివారు నాన్నగారు, అక్కినేని నాగేశ్వరరావు అని… నాన్నగారు నేర్పిన క్రమశిక్షణ, బాబాయ్ నుంచి పొగడ్తలకు దూరంగా ఉండడం అన్న విషయాన్ని నేర్చుకున్నానని వెల్లడించారు బాలయ్య. ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.

నాగేశ్వరరావు గారు తన పిల్లలకంటే ఎక్కువగా నన్ను ప్రేమించే వారని..నాన్న పరమపదించిన అనంతరం ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికి అందించడం జరిగిందని తెలియజేశారు. బాబాయిపై ప్రేమ గుండెల్లో ఉంటుందని.. బయట ఏం జరిగినా నేను పట్టించుకోనని స్పష్టం చేశారు బాలయ్య. ఇక బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news