బాలకృష్ణ బోయపాటితో ఆడుకుంటున్నాడా ?

బాలకృష్ణతో బోయపాటి గేమ్స్ ఆడుతున్నారని నందమూరి ఫ్యాన్స్‌ తెగ ఫీల్ అవుతున్నారట. ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ కోసం మ్యూజికల్‌ ఛైర్‌ కండక్ట్ చేశారు. ఒక ఛైర్‌ చుట్టూ.. ముగ్గురు ముద్దుగుమ్మలు తిరుగుతున్నారు. ఆ ఛైర్‌ ఎవరికి దక్కుతుందో తెలీడం లేదు. ఒక్కోసారి ఒక్కొక్కరిని ఆ ఛైర్‌లో కూర్చోపెట్టి వెంటనే లేపేస్తున్నాడు బోయపాటి. మరి ఈగేమ్‌ ఆగేది ఎప్పుడు గెలిచే ముద్దుగుమ్మ ఎవరో తెలీక కన్ఫ్యూజన్ లో ఉన్నారు నందమూరి ఫ్యాన్స్.

కరోనా రాకముందు… బాలకృష్ణ, బోయపాటి సినిమా మొదలై ఓ ఫైట్ సీన్‌ కూడాపూర్తిచేసుకుంది. 8 నెలలు గడిచినా.. బాలకృష్ణకు హీరోయిన్ని వెతకలేకపోయాడు బోయపాటి. ఎంతోమంది పేర్లు బైటకొచ్చినా.. ఆమధ్య మలయాళ కుట్టి ప్రయాగ మార్టిన్‌తో షూట్‌ కూడా చేసి.. చివరికి వద్దనుకున్నారు. ప్రయాగ మార్టిన్‌ బాలకృష్ణ పక్కన సూట్‌ కాలేదా? తేడా ఎక్కడొచ్చిందోగానీ.. ఈమె ప్లేస్‌లో అఖిల్‌ హీరోయిన్‌ సాయేషా సైగల్‌ను తీసుకున్నారు. దర్శకనిర్మాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. సాయేషా పోస్ట్ పెట్టడంతో హమ్మయ్య బాలయ్యకు జోడీ కుదిరిందని చిత్ర వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. అయితే ఈ ముచ్చట మూన్నాళ్లగానే మిగిలింది.

తేడా ఎక్కడ జరుగుతుందోగానీ… బాలకృష్ణ హీరోయిన్స్‌ మారుతూనే వున్నారు. మొన్న ప్రయాగ.. నిన్న సాయేషా.. ఇవాళ ప్రగ్యా జైస్వాల్‌. బోయపాటి అటు ఇటు తిరిగి పాత బొమ్మనే పట్టుకొచ్చాడు. జయ జానకి నాయకలో నటించిన ప్రగ్యానే తీసుకొచ్చాడు బోయపాటి. సినిమా బడ్జెట్‌ తగ్గించుకునే క్రమంలో.. హీరోయిన్స్‌ విషయంలో పొదుపు పాటిస్తున్నారు. ఈక్రమంలో అస్సలు క్రేజ్‌ లేని ప్రగ్యాను బాలయ్య పక్కన నిలబెట్టారు.

స్టార్‌ హీరోయిన్‌ అయితే మినిమం కోటి ఇవ్వాలి. 20 లక్షల హీరోయిన్స్‌ను వెతుకుతూ.. బడ్జెట్‌ భారాన్ని తగ్గిస్తున్నారు. మొత్తానికి బోయపాటి ఆశీస్సులతో రెండేళ్లుగా ఆఫర్స్‌ లేని ఈ ఫేడౌట్‌ హీరోయిన్ బంపర్‌ ఆఫర్‌ కొట్టేసింది.