బంభోళే పాటలో లక్ష్మీ ఉగ్రరూపం..

-

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన లక్ష్మీ సినిమా నవంబరు 9వ తేదీ నుండి డిస్నీ హాట్ స్టార్ లో అందుబాటులో ఉండనుంది. దీపావళి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. ఓటీటీలో వస్తున్న మాస్ సినిమా కావడంతో అందరి కళ్ళు ఈ సినిమాపైనే ఉన్నాయి. తమిళంలో సూపర్ హిట్ అనిపించుకున్న కాంచన చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాని ఒరిజినల్ సినిమా డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించాడు.

లారెన్స్ కి ఇదే మొట్టమొదటి బాలీవుడ్ చిత్రం. ట్రైలర్ కి మంచి స్పందన రావడంతో సినిమా ప్రేక్షకులని అలరిస్తుందని భావిస్తున్నారు. హార్రర్, కామెడీని మిక్స్ చేసి సక్సెస్ సాధించిన రాఘవ లారెన్స్, హిందీలోనూ విజయం అందుకుంటాడా లేదా చూడాలి. తాజాగా ఈ సినిమా నుండి బంభోళే అనే పాటని రిలీజ్ చేసారు. కాంచనగా అక్షయ్ కుమార్ గెటప్ అదిరిపోయింది. శివుడి ముందు నృత్యం చేస్తున్న కాంచన కళ్ళలో ఉగ్రరూపం కనిపిస్తుంది.

ఒక్కసారి వినగానే ఆకట్టుకునేలా ఉన్న ఈ పాట సినిమాపై అంచనాలని మరింత పెంచింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ఫాక్స్ స్టార్ స్టూడియో నిర్మించింది.

Read more RELATED
Recommended to you

Latest news