తెలుగు రాష్ట్రాల‌ లో ఇష్ట మైన వారు ఎవ‌రో చెప్పిన బండ్ల గ‌ణేష్

తెలుగు రాష్ట్రా ల‌లో త‌న‌కు ఇష్ట మైన వారు వీరే అంటూ ప్ర‌ముఖ నిర్మాత, క‌మెడియ‌న్ బండ్ల గ‌ణేష్ ట్వీట్ట‌ర్ లో ఫోటో ల‌ను షేర్ చేశాడు. అలాగే ‘నాకు తెలిసిన‌ నాకిష్ట‌మైన తెలుగు జాతి ర‌త్నాలు వీరే’ అనే క్యాప్ష‌న్ ను కూడా ఉంచాడు. ఈ పోస్టు లో మెగా స్టార్ చిరంజీవి, ఈనాడు అధినేత రామోజీ రావు, తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్య మంత్రులు నంద‌మూరి తార‌క రామా రావు, వైఎస్ రాజ‌శేఖర్ రెడ్డి, చంద్ర బాబు ఉన్నారు. అలాగే తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ తో పాటు ఉప రాష్ట్ర ప‌తి వెంక‌య్య నాయుడు, సుప్రీం కోర్టు సీజేఐ ఎస్వీ ర‌మ‌ణ అని తెలిపాడు.

వీరి ఫోటో ల‌ను కూడా బండ్ల గ‌ణేష్ పోస్టు చేశాడు. అయితే బండ్ల గ‌ణేష్ చేసిన ట్విట్ కు ఒక‌రు ”నువ్వు సూపర్ గణేష్ ఎక్కడ ఆడాల్సిన ఆట అక్కడ ఆడతావు.. ఇందులో కేసీఆర్, రాజశేఖర్ రెడ్డి ఎందుకు నచ్చారో ఒక్క మాటలో చెప్పు” అంటూ కామెంట్ చేశాడు. దీనికి కౌంట‌ర్ గా బండ్ల గ‌ణేష్.. ”ఒక్కసారి వచ్చి నన్ను కలవండి ఎందుకు నచ్చారో చెబుతాను సోదరా” కామెంట్ చేశారు.