ప్రపంచంలో ఎక్కువ మంది చూసిన టీవీ షో ఏదో తెలుసా?

-

సినిమా రంగం అంటే ఇష్టపడని వారుండరు. సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో కొన్ని టీవీ షోలు, సీరియల్స్కు కూడా అంతే పాపులారిటీ ఉంటుంది. ఎన్నో కోట్ల మంది ప్రేక్షకులు వీటిని చూసి ఎంజాయ్‌ చేస్తుంటారు. అయితే ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కువమంది చూసిన టీవీ షో ఏది.. దాన్ని ఎన్ని కోట్ల మంది వీక్షించారో మీకు తెలుసా?

 

ప్రపంచంలో ఎక్కువమంది చూసిన షో ‘బేవాచ్‌’. ఈ అమెరికన్‌ టీవీ షోను 1996లో ఒక్క వారంలోనే 110కోట్ల మందికి పైగా వీక్షించడంతో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంది. అప్పుడు నమౌదైన ఆ రికార్డును 28 ఏళ్లు గడుస్తున్నా ఏ ఇతర టీవీ షో కూడా బ్రేక్‌ చేయలేకపోయింది. లాస్‌ ఏంజిల్స్‌, కాలిఫోర్నియాలోని బీచ్‌ల్లో ఉండే కొందరు లైఫ్ గార్డ్స్‌ జీవితాల చుట్టూ తిరిగే కథే ఈ ‘బేవాచ్‌’. 1989 సెప్టెంబర్‌ 22న దీని మొదటి ఎపిసోడ్‌ ప్రసారమైంది. ఈ షోను ఏకంగా 148 దేశాల్లో 44 భాషల్లో టెలీకాస్ట్‌ చేశారు. 1989 నుంచి 2001 వరకు మొత్తం 11 సీజన్లు ఇది ప్రసారమైంది.

Read more RELATED
Recommended to you

Latest news