అందాల నిధి అగర్వాల్ .. చూస్తే త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే!

ఓ పిల్ల తెలుగు ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి చేసింది కొన్ని సినిమాలే అయినా ప్రేక్ష‌కుల గుండెల్లో నిలిచిపోయింది. త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమెనే నిధి అగర్వాల్. స‌వ్య‌సాచితో ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ ఆ తర్వాత అక్కినేని అఖిల్‌తో మిస్టర్ మజ్నులో చేసి అంద‌రినీ ఫిదా చేసింది. ఆ త‌ర్వాత బాలీవుడ్‌కు చెక్కేసింది.

నిధి అగర్వాల్

టాలీవుడ్‌లో అక్కినేని అన్న‌ద‌మ్ములు హ్యాండిచ్చినా కూడా పెద్ద‌గా గుర్తింపు తెచ్చుకోలేక‌పోయింది నిధి అగర్వాల్ . అయితే ఆ త‌ర్వాత ఇస్మార్ట్ శంకర్ మూవీలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. ఇక ఆ మూవీతో వ‌రుస ఆఫ‌ర్లు కొట్టేసింది. ప్ర‌స్తుతం పవన్ కళ్యాణ్ ప‌క్క‌న హరి హర వీరమల్లు మూవీలో చేసే బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసింది.

ఇక దీంతోపాటు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కూడా ఈమే న‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇక భారీ ప్రాజెక్టు అయిన రామ్ చరణ్ అండ్ శంకర్ కాంబోలో తీస్తున్న సినిమాలో కూడా నిధి పేరునే వినిపిస్తోంది. కాగా నిధి అగర్వాల్ షేర్ చేస్తున్న హాట్ ఫొటోలు నిత్యం వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం షేర్ చేసిన ఫొటోలు ఫుల్ వైర‌ల్ అవుతున్నాయి.