ఛార్మీపై బెల్లంకొండ రుస‌రుస‌లు?

-

హాట్ ప్రొడ్యూస‌ర్ ఛార్మీపై బెల్లంకొండ రుస‌రుస‌లాడుతున్నాడా? త‌న‌కి పోటీగా ఛార్మీ దిగుతుంద‌నే ఆగ్ర‌హంతో ఊగిపోతున్నాడా? అంటే అవున‌నే వినిపిస్తోంది. అస‌లే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స‌క్సెస్ కోసం భ‌గీర‌థ ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఇటీవ‌లే ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న సీత ఘోరంగా ఫెయిలైంది. దీంతో ప్ర‌స్తుతం ఆశ‌ల‌న్నీ రాక్ష‌సుడిపైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాతోనైనా హిట్ కొట్టి గెలుపు గుర్ర‌మెక్కాల‌ని త‌హ‌త హ‌లాడుతు న్నాడు. అందుకే పోటీ లేని టైమ్ చూసుకుని రాక్ష‌సుడు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసాడు. జులై 18న సినిమా విడుద‌ల చేసేందుకు స‌న్నాహాకాలు చేసుకుంటున్నాడు. అయితే అదే రోజున ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ క‌థానాయ‌కుడిగా పూరి జ‌గ‌న్నాత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఇస్మార్ట్ శంక‌ర్ ను రిలీజ్ చేయ‌డానికి నిర్ణ‌యించారు.

bellamkonda suresh Fair on Charmi

వాస్త‌వానికి ఈ సినిమాను ముందుగా జులై 12న రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ అదే నెల 14న వ‌ర‌ల్డ్ క‌ప్ పైన‌ల్ మ్యాచ్ ఉంది. ఆ రెండు రోజులు ప్ర‌పంచ‌మంతా క‌ప్ ఫీవ‌ర్ న‌డుస్తుంది. ఎంత పెద్ద స్టార్ సినిమా రిలీజ్ అయినా టిక్కెట్లు తెగ‌డం అసాధ్యం. అది గ‌మ‌నించి పూరి టీమ్ ఇస్మార్ట్ శంకర్ ను 18వ తేదికి వాయిదా వేసుకుంది. అయితే ఈ థాట్ వెనుక క‌ర్త క‌ర్మ క్రియ కేవ‌లం ఛార్మీ అనే వినిపిస్తోంది. వాస్త‌వానికి రెండు సినిమాల‌ను మ్యూచ్ వ‌ల్ అండ‌ర్ స్టాండిగ్ మీద రిలీజ్ చేయాల‌నుకున్నారుట‌. ఈ ప్ర‌పోజ‌ల్ కు పూరి ఒకే అన్నా.. మ‌రో నిర్మాత ఛార్మీ ఒప్పు కోలేదుట‌.

దీంతో బెల్ల‌కొండ చార్మీపై సీరియ‌స్ గా ఉన్నాడుట‌. పూరికి లేని ప్రాబ్ల‌మ్ ఛార్మీకి ఏంట‌ని? స‌న్నిహితుల వ‌ద్ద అస‌హ‌నం వ్య‌క్తం చేసాడుట‌.బెల్ల‌కొండ అవేద‌న‌లో అర్ధ‌ముంది. `రాక్ష‌సుడు` రిలీజ్ అవుతోన్న నేప‌థ్యంలో `ఇస్మార్ట్ శంక‌ర్` వ‌స్తే బెల్ల‌కొండ‌కి పెద్ద దెబ్బే త‌గులుతోంది. ఆడియ‌న్స్ అంతా రామ్ సినిమా వైపే ప‌రుగులు తీస్తారు. అందుకే బెల్ల‌కొండ స‌తాయిస్తున్నాడు. అయితే ఇక్క‌డ టాక్ అనేది కీల‌క పాత్ర పోషిస్తుంది. హిట్ టాక్ ఏ సినిమాకు బాగుంటే ఆ సినిమావైపే జ‌నాలు ప‌రుగులు తీస్తార‌న్న విషయం కూడా గుర్తించాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version