బిగ్ బాస్ 3 టీజ‌ర్ వ‌చ్చేసింది..!

-

స్టార్ మా గ‌త కొంత సేప‌టి క్రిత‌మే.. త‌న ఫేస్‌బుక్ ఖాతాలో బిగ్‌బాస్ 3 కి సంబంధించి ఓ టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. దీంతో ఈ సారి బిగ్‌బాస్ షో జ‌రుగుతుంద‌ని రూఢి అయింది.

బిగ్ బాస్ రియాలిటీ షో.. తెలుగులో కేవ‌లం రెండే సీజ‌న్ల‌నే పూర్తి చేసుకుంది. కానీ ఆ షోకు మాత్రం బాగానే స్పంద‌న వ‌చ్చింది. తొలి సీజ‌న్‌లో ప్ర‌ముఖ న‌టుడు జూనియ‌ర్ ఎన్‌టీఆర్ త‌నదైన శైలిలో ఆ షోను ర‌క్తి క‌ట్టిస్తే.. రెండో సీజ‌న్‌లో నాని అభిమానుల‌ను మ‌రిపించాడు. ఇక మూడో సీజ‌న్‌కు ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడ‌ని టాక్ న‌డుస్తోంది. వ‌చ్చే వారంలో ఇందుకు సంబంధించి స్టార్ మా యాజ‌మాన్యం ఓ ప్రెస్ మీట్‌ను కూడా పెట్ట‌నుంద‌ట‌. అయితే ఈ సారి వ‌ర‌ల్డ్ కప్ నేప‌థ్యంలో బిగ్ బాస్ 3 జ‌రుగుతుందా, లేదా అని అంద‌రూ భావించారు. కానీ అన్ని అనుమానాల‌కు స్టార్ మా ఎట్టకేల‌కు తెర దించింది. త్వ‌ర‌లోనే బిగ్ బాస్ 3 సీజ‌న్ ఆరంభ‌మ‌వుతుందని తెలిపింది.

స్టార్ మా గ‌త కొంత సేప‌టి క్రిత‌మే.. త‌న ఫేస్‌బుక్ ఖాతాలో బిగ్‌బాస్ 3 కి సంబంధించి ఓ టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. దీంతో ఈ సారి బిగ్‌బాస్ షో జ‌రుగుతుంద‌ని రూఢి అయింది. అయితే షో ఎప్పుడు ప్రారంభ‌మ‌య్యే తేదీల‌ను వెల్లడించ‌క‌పోయిన‌ప్ప‌టికీ వ‌చ్చే నెల మొద‌టి వారంలోనే ఈ షో ప్రారంభం కావ‌చ్చ‌ని తెలిసింది. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే స్టార్ మా ఈ సారి బిగ్‌బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితాను కూడా ఇప్ప‌టికే సిద్ధం చేసిన‌ట్లు తెలిసింది. ఇక కంటెస్టెంట్లు పాల్గొనే ఇంటి నిర్మాణంతోపాటు షో ట్రైల‌ర్, ప్ర‌చార కార్య‌క్ర‌మాలే మిగిలి ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఇవాళ విడుద‌లైన బిగ్ బాస్ 3 టీజర్‌తో ఇక షో చాలా త్వ‌ర‌గా ప్రారంభ‌మ‌వుతుంద‌ని మ‌న‌కు తెలుస్తుంది.

కాగా ఈ సారి ఈ షోలో బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల, యాంకర్ ఉదయభాను, యూట్యూబ్ స్టార్ మహాతల్లి, నటుడు జాకీ, నటుడు కమల్ కామరాజ్, నటి గాయత్రీ గుప్తా, యాంకర్ సావిత్రి, మోడల్ సింధూర గద్దె, జబర్దస్త్ ఫేం పొట్టి గణేశ్, సింగర్ హేమచంద్ర, డ్యాన్స్ మాస్టర్ రఘులు కంటెస్టెంట్లుగా సెలెక్ట్ అయిన‌ట్లు స‌మాచారం. అలాగే పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ లు బిగ్ బాస్ హౌస్‌లోకి స‌ర్‌ప్రైజ్ కంటెస్టెంట్లుగా అడుగుపెట్టనున్నారట. మ‌రి ఈ సారి బిగ్ బాస్ షో ప్రేక్ష‌కుల‌ను ఎలా అల‌రిస్తుందో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version