Big Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్‌పై నాగార్జున ఆగ్రహం..కంటెస్టెంట్స్ సైలెంట్

-

పాపులర్ రియాలిటీ షో తెలుగు ‘బిగ్ బాస్’ ఓటీటీ రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ మధ్య ఫైట్స్ రోజురోజుకూ తారాస్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా బిగ్ బాస్ నిర్వాహకులు రిలీజ్ చేసిన ప్రోమో నెట్టింట తెగ వైరలవుతోంది. సదరు ప్రోమోలో హోస్ట్ నాగార్జున చాలా సీరియస్ గా కనిపించారు.

హౌజ్ లో ఇంటి సభ్యులైన నటరాజ్ మాస్టర్, యాంకర్ శివ మధ్య ఫైట్ జరిగింది. ఈ క్రమంలోనే వారిరువురు కొట్టుకోబోయారు కూడా. కెప్టెన్ అషురెడ్డి గొడవ సద్దుమణిగేలా చేసింది. అయినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. దూషణల పర్వం స్టార్ట్ చేశారు నటరాజ్ మాస్టర్. ఈ విషయమై నాగార్జున క్లారిఫికేషన్ అడిగారు.

లుంగీ ఎత్తడం కాని కుర్తాలు ఎత్తడం కాని ఎందుకు చేశావని శివను అడిగారు. అంతలో నటరాజ్ మాస్టర్ కలగజేసుకుని అదంతా అబద్ధం అని అన్నారు. దాంతో నాగార్జున ఫైర్ అయ్యారు. నటరాజ్ మాస్టర్ ప్లీజ్ బీ సైలెంట్ అని అరిచేశారు. దాంతో ఒక్కసారిగా కంటెస్టెంట్స్ అందరూ సైలెంట్ అయ్యారు. అలా ‘బిగ్ బాస్ ఓటీటీ తెలుగు’ వీకెండ్ ప్రోమోలో కంటెస్టెంట్స్ ను అదరగొట్టేశారు నాగార్జున. చూడాలి మరి.. నెక్స్ట్ ఏం జరుగుతుందో.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ ఓటీటీ ఎపిసోడ్ స్ట్రీమ్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news