వైసీపీ పార్టీలో కీలక నేత అయిన.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి… తిరుపతి అర్భన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ పదవీ కాలాన్ని పొడగిస్తూ.. సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీ లక్ష్మి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తుడా ఛైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. పదవీ కాలం మరో రెండు నెలల్లో ముగియనుంది.
అయితే.. ముందుగానే పదవీ కాలం పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వాస్తవానికి 2022 జూన్ 12 వ తేదీన చెవిరెడ్డి పదవీ కాలం ముగియాల్సి ఉంది. అయితే.. మంత్రి పదవులకు సంబంధించి తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. వైసీపీ పార్టీలో కీలకంగా ఉన్న.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మంత్రి పదవీ వస్తుందని అందరూ ఆశించారు. ఆయనకు దేవాదాయ శాఖ పదవి వస్తుందని కూడా వార్తలు వచ్చాయి. కానీ చివరికి.. తిరుపతి అర్భన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ పదవీ కాలాన్ని పొడగిస్తూ.. సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆయనకు షాక్ తప్పలేదు.