భగవంత్ కేసరి నుండి బిగ్ అప్డేట్.. దద్దరిల్లిపోయేలా..?

-

నటసింహ నందమూరి బాలకృష్ణ గత చిత్రాలు అయిన అఖండ , వీరసింహారెడ్డి సినిమాలతో భారీ బ్లాక్ బాస్టర్ లను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన సినిమాలు వస్తున్నాయి అంటే చాలు అభిమానులలో ఏదో తెలియని ఆసక్తి నెలకొంటుంది. ఎక్కువగా మాస్ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరుగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న బాలయ్య ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్య లుక్ కు సంబంధించి.. ఇప్పటికే పలు పోస్టర్లు బయటకు రాగా సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారని చెప్పాలి.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా.. పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకున్న ఈమె సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోంది. శ్రీ లీలా కూడా ఈ సినిమాలో నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ తో పాటు కావలసినంత కామెడీ కూడా ఉంటుందని ఇప్పటివరకు ఈ సినిమాలో పలు జాగ్రత్తలు తీసుకొని సన్నివేశాలను చాలా అద్భుతంగా రూపొందించినట్లు సమాచారం.

ఇక అఖండ, వీర సింహారెడ్డి సినిమాల లాగే ఇది కూడా సూపర్ హిట్గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు డైరెక్టర్ అనిల్.ఇకపోతే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేస్తున్నారు మేకర్స్. త్వరలోనే ఫస్ట్ సాంగ్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా.. సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్డేట్ లను ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news