Pushpa 2 నుంచి బిగ్ అప్డేట్..విలన్ వచ్చేశాడు !

-

అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని దేశవ్యాప్తంగా నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా కేవలం దక్షిణాదిని మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా వందల కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించి అత్యంత అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.

సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండవ భాగం కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సర వేగంగా జరుగుతుంది ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో ఫాహద్‌ ఫజిల్‌ షెడ్యూల్‌ పూర్తి అయింది. ఈ మేరకు పుష్ప 2 టీం అధికారిక ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news