ఏపీలో రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని కృష్ణా జిల్లా లారీ ఒనర్స్ ప్రతినిధులు సంచలన వ్యాఖ్యలు చేశారు. పెంచిన గ్రీస్ ట్యాక్స్ పై కృష్ణా జిల్లా లారీ ఒనర్స్ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సరకు రవాణా వాహనాలపై త్రైమాసిక పన్ను పెంచడం సరైంది కాదు..ఒకేసారి 30 శాతం వరకు పన్ను పెంచడం చాలా దారుణం అన్నారు.
పన్నులు పెంచవద్దని మంత్రికి, ఉన్నతాధికారులను వేడుకున్నా పట్టించుకోలేదు..లారీ యజమానులతో కనీసం చర్చించకుండానే పన్నులు పెంచారని ఆగ్రహించారు. మిగిలిన రాష్ట్రాల కంటే ఎపీలో పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయి..అధికంగా డీజిల్ ధరలు వసూళ్ల వల్ల నష్టాలు వస్తున్నాయని వివరించారు. ఎక్కడాలేనట్లుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2021డిసెంబర్ లోనే గ్రీస్ టాక్స్ పెంచారు..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు ఇంటర్ స్టేట్ పర్మిట్లు ఇవ్వలేదన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారులు మినహా ఏ రోడ్లూ బాగాలేవు..లారీల ఫిట్ నెస్ చార్జీలు 920 నుంచి 13500 రూపాయలకు పెంచారని వివరించారు. పన్నులు తగ్గించకపోతే అవసరమైతే బంద్ కు వెళ్తామని జగన్ సర్కార్ కు వార్నింగ్ ఇచ్చారు.