తెలుగు బుల్లితెర పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ 3 ఫైనల్ దశకు వచ్చేసింది. మరో వారం రోజుల్లో ఈ మూడో సీజన్ ముగియనుంది. బిగ్ బాస్ 3 విన్నర్ రేస్ లో ఐదుగురు కంటెస్టెంట్ లు పోటీపడుతున్నారు. వీరిలో ఎవరు అంతిమ విజేత గా నిలుస్తారు అన్నది తెలుగు ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతోంది. యాంకర్ శ్రీముఖి, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, హీరో వరుణ్ తేజ్, డ్యాన్స్ మాస్టర్ భాస్కర్‌తో పాటు మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అలీ రెజా ఫైనల్ రేసులో నిలిచారు. ఇక ఖచ్చితంగా ఫైనల్‌కు వెళుతుందని అందరూ భావించిన శివజ్యోతి చివరి మెట్టు దగ్గర నుంచి నిష్క్రమించిక తప్పలేదు.
హౌస్ నుంచి ఒకసారి ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిన అలీ రెజా తిరిగి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హౌస్‌లోకి తిరిగి వచ్చిన అలీ ఫైనల్ కు వెళతాడు అని ఎవరూ ఊహించలేదు.
ఈ ఐదుగురిలో బిగ్ బాస్ విన్నర్ రేస్‌లో శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా గెలుస్తారు అని అంచనాలు వెలువడుతున్నాయి. అయితే బిగ్ బాస్ రూల్స్ ప్రకారం కెప్టెన్ కాని వాళ్లు కూడా విన్నర్ కావచ్చా ? అన్నది కాస్త సస్పెన్స్ గా ఉంది.
ఎందుకంటే విన్నింగ్ రేసులో ఉన్న శ్రీముఖి బాబా భాస్కర్ కెప్టెన్ అయ్యారు. వరుణ్ తేజ్ సైతం వరుసగా రెండు వారాలు కెప్టెన్ గా ఉన్నారు. ఇక రాహుల్ ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేదు.. ఈ నేపథ్యంలో హౌస్ కు ఒకసారి కూడా కెప్టెన్ కానీ వాళ్లు కూడా బిగ్ బాస్ ఛాంపియన్ షిప్ గెలుచుకునే వీలు ఉంటుందా.. ? ఈ విషయంలో బిగ్‌బాస్ రూల్స్ ఎలా ? ఉంటాయో అన్నది చివరి వరకు కానీ తెలియదు. ఇక రాహుల్ సిప్లిగంజ్ వరుసగా నామినేషన్ లో ఉంటూ ప్రేక్షకుల వోటింగ్ తో సేఫ్ అవుతూ అంచనాలను మించి ఫైనల్ కు వచ్చిన సంగతి తెలిసిందే.