గోదావరి జిల్లాల నుంచి మహిళలు అక్కడికే ఎందుకు ఎక్కువగా వెళ్తున్నారు…?

-

గోదావరి జిల్లాలు” పచ్చదనానికి పెట్టింది పేరు. కొబ్బరి చెట్లు, వరిపొలాలు, బత్తాయి తోటలు ఇలా రకరకాల పంటలతో ఎప్పుడు పచ్చదనంతో కనిపిస్తూ ఉంటాయి. వందల ఎకరాల్లో రైతులు పంటలు పండిస్తూ ఉంటారు. తమ బిడ్డలకు వారసత్వంగా వ్యవసాయాన్నే ఇస్తూ ఉంటారు. ఇక అక్కడ వ్యవసాయ కూలీలకు నిత్యం పని ఉంటూ ఉంటుంది. రైతులు ఎప్పుడూ ఏదోక పనితో వాళ్లకు ఉపాధి కల్పిస్తూ ఉంటారు. దీనితో ఇతర ప్రాంతాల్లో ఉండే వ్యవసాయ కూలీలు కూడా ఇక్కడికి పనులు వెతుక్కుని వస్తూ ఉంటారు.

 

కాని ఇక్కడ ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇక్కడి నుంచి ఎక్కువగా మహిళలు విదేశాలకు వెళ్తున్నారు అవును… భారీగా మహిళలు పనులు వెతుక్కుంటూ గల్ఫ్ దేశాల బాట పడుతున్నారు. రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, కొవ్వూరు, భీమవరం ప్రాంతాలకు చెందిన మహిళలు ప్రతీ ఏటానులు వెతుక్కుని కతార్, కువైట్, దుబాయ్ వంటి దేశాలకు వెళ్తున్నారు. దీనికి కారణం ఏంటి…?  పకొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ దళిత వర్గాలకు చెందిన మహిళలు ఎక్కువగా విదేశాల బాట పడుతున్నారు.

ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువగా విదేశాలకు వెళ్తూ అక్కడ భారీగా సంపాదించే అవకాశం వెతుక్కుంటున్నారు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు చెయ్యడానికి, పిల్లలను ఉన్నత చదువులు చదివించడానికి ఇక్కడ వచ్చే సంపాదన సరిపోవడం లేదని, భర్తల సంపాదన ఇక్కడ సరిపోవడం లేదని, ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదని, అక్కడి కి వెళ్లి సంపాదించుకుని కాస్త వెనకేసుకుని తిరిగి వస్తున్నారు. చాలా వరకు ధలితుల్లోనే, బీసి వర్గాల్లో ఇది ఎక్కువగా ఉందని అక్కడి స్థానికులు చెప్తున్నారు. ఇక ఇది రాయలసీమ ప్రాంతంలో ఉన్నా ఈ స్థాయిలో లేదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version