గ‌డుసు పిండం ‘అరియానా’.. టాప్ 5 కాదు టాప్ 2

-

బిగ్‌బాస్ 4 తెలుగు సీజ‌న్లో ఇప్ప‌టివ‌ర‌కు దాదాపుగా సేఫ్ గేమ్ ఆడుతూ షోను స్లోగా సాగిస్తున్నారు. అందరిలోకెల్లా డిఫ‌రెంట్‌గా తెలివిగా ఆడుతుందెవ‌ర‌య్యా అంటే అరియానా గ్లోరి. అవును త‌ను మ‌నసులో ఏమ‌నుకుంటుందో అదే చేస్తూ, చెబుతూ త‌ను వ‌చ్చిందే ఆడ‌టానిక‌న్న‌ట్లు త‌న గ‌డుసుత‌నం చూపిస్తుంది. నిజానికి అరియానా త‌ను ఎలా ఉందో అలాగే ఉంటుందా అంటే కొంచెం డౌట్‌గానే ఉన్నా బాగా ఆడుతుంది. మ‌రి ఆ డౌట్ ఏంటంటే త‌ను ఏదైనా చెప్పిన‌ప్పుడు బిగ్‌బాస్‌ను, ప్రేక్ష‌కుల‌ను మ‌ద్య‌లోకి తీసుకొస్తూ ఎదుటి వాళ్ల‌ను ఇర‌కాటంలో పెడుతుంది. చెప్పేది క్లియ‌ర్ అంటూనే ఇలా తెలివిగా ఆడుతుంది.

బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన వారంద‌రూ ఆడ‌టానికే, టైటిల్ కొట్ట‌డానికే వెళ్తారు క‌దా.. మ‌రి అందులోకి వెళ్లి నేను ఇది నేర్చుకున్నా అది నేర్చుకున్నానంటూ సోది పెడుతున్నా.. అరియానా మాత్రం త‌న మార్క్ ఆట‌ను చూపిస్తూ త‌న కంటూ ఓ ఫ్యాన్ బేస్‌ త‌యారు చేసుకుంది. మొద‌ట్లో సోహైల్‌తో క్లోజ్‌గా ఉన్నా.. త‌రువాత అవినాష్ ఎంట్రీతో గేమ్ స్ట్రాట‌జీ మార్చేసింది. అవినాష్‌ కు ద‌గ్గ‌ర‌గా ఉంటూ వచ్చింది.. దీంట్లో కూడా లాజిక్ ఉందండోయ్ లెక్క ప్ర‌కారం అవినాష్ ఎంట్రీతో బిగ్‌బాస్ షోకు ఊపు వ‌చ్చింది. సో అవినాష్ ఎక్కువ రోజులు షోలో కొన‌సాగుతాడనేది ఆ లాజిక్‌.

ఎవ్వ‌రైనా గెల‌వ‌టానికే వ‌స్తారుగా.. అక్క‌డ స్ట్రాట‌జీ లేక‌పోతే ఎలా.. ఉన్నా త‌ప్పేం కాదు క‌దా.. లేక‌పోతేనే ఇంటికి వ‌చ్చేస్తారు. ఆ మాత్రం గ‌డుసుత‌నం ఉంది కాబ‌ట్టే ఇంత‌వ‌ర‌కు వ‌చ్చిందీ అమ్మ‌డు. బిగ్‌బాస్ 4 స్టార్టింగ్‌లో అరియానా రెండు వారాలుంటే గొప్ప అనుకున్న‌వాళ్లే ఇప్పుడు అరియానాకి ఫిదా అవుతున్నారు.

ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అదే నిజ‌మైతే?? దేవి నాగవల్లి గ‌న‌క హౌస్‌లోకి ఎంట‌ర్ అయితే మాత్రం అరియానా టాప్ 2లో ఉండ‌టం ఖాయం. రాసి పెట్టుకోండి. వీరిద్ద‌రి బాండ్ అలా క‌నిపించింది మ‌రి.

Read more RELATED
Recommended to you

Latest news