బిగ్‌బాస్ 4: బిగ్ ట్విస్ట్‌..అఖిల్ కి చుక్క‌లు చూపించిన నాగ్‌!

-

హౌస్‌లో ఎవ‌రు స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవ‌రో ఇంటి స‌భ్యులు చెప్పి నామినేట్ చేయండి అని బిగ్‌బాస్ అర్థ్ర రాత్రి టాస్క్ ఇవ్వ‌డంతో ఇంటి స‌భ్యులు అంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అఖిల్‌ని నామినేట్ చేశారు. దీంతో అఖిల్‌ని బిగ్‌బాస్ సీక్రెట్ రూమ్‌లోకి పంపించేశారు. సీక్రెట్ రూమ్‌లో వుంటూ ఇంటి సభ్యుల్ని అబ్జ‌ర్వ్ చేశాడు. శ‌నివారం దీపావ‌ళి స్పెష‌ల్ కావ‌డంతో ఊహించిన‌ట్టు ఎపిసోడ్ కూల్‌గా ఎంట‌ర్‌టైనింగ్‌గా వుంటుంద‌ని అంతా ఊహించారు.

కానీ దీనికి పూర్తి భిన్నంగా ఈ శ‌నివారం ఎపిసోడ్ సాగింది. ఈ రోజు దీపావ‌ళి కావ‌డంతో నాగార్జున‌కు ఆయ‌న సినిమాల్లోని పాట‌ల‌కు పెర్ఫార్మ్ చేసి కంటెస్టెంట్స్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆ త‌రువాత హైస్‌లో ఆట‌మ్ బాంబ్ ఎవ‌ర‌నే టాస్క్‌లో అత్య‌ధిక భాగం కంటెస్టెంట్స్ అభిజిత్ అని చెప్పేశారు. అవినాష్ అరినాయా ఆట‌మ్ బాంబ్ అని చెబితే హారిక .. మోహ‌బూబ్‌ని ఆట‌మ్ బాంబ్ అంది. సోహైల్‌ని అంతా చిచ్చు బుడ్డితో పోల్చారు. ఈ క్ర‌మంలో సోహైల్‌ని హారిక వేస్ట్ అని చెప్పేసి షాకిచ్చింది.

ఆ త‌రువాతే గేమ్‌లో పెద్ద ట్విస్ట్‌.. సీక్రెట్ రూమ్‌లో వున్న అఖిల్‌ని స్ట్రాంగ్ కంటెస్టెంట్‌వి చాలా సంద‌ర్భాల్లో డిఫెండ్ చేశాయ్ బ‌య‌టికి వెళ్లిపోమ‌ని చెబితే ఎలా న‌మ్మి బ‌య‌టికి వ‌చ్చేశాయ్ అని నాగ్ అడ‌గ‌డం.. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని పంపించేసి లూస్ కంటెస్టెంట్‌లతో గేమ్ ఎలా ఆడ‌తార‌నిపించింది.. అందుకే డిఫెండ్ చేయ‌కుండా ఒప్పుకున్నాను అన్నాడు అఖిల్‌.. దీంతో చిర్రెత్తుకొచ్చిన నాగ్ నీ ఆలోచ‌న త‌ప్ప‌ని నువ్వు ఎలిమినేట్ అయ్యావ‌ని బ్యాగ్‌ స‌ర్దేసుకోమ‌ని చెప్ప‌డంతో ఒక్క‌సారిగా అఖిల్ షాక్‌కు గుర‌య్యాడు. ఈ సంద‌ర్‌భంగా అఖిల్‌కి బిగ్‌బాస్ చుక్క‌లు చూపించాడ‌ని చెప్పొచ్చు. నాగ్‌ని ఎంత వేడుకున్నా విన‌క‌పోవ‌డంతో సెల్ఫీ కోసం అఖిల్ హౌస్‌లోకి వెళ్లిపోయాడు. అక్క‌డ మ‌ళ్లీ అఖిల్‌కి టాస్క్ ఇచ్చాడు నాగ్‌..‌..

వెళ్లిపోయే ముందు ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఎవ‌రికిస్తావ్‌.. ఎనీమీస్ ఎవ‌రు హైస్‌లో అని అఖిల్‌ని అడిగాడు నాగార్జున‌. సోహైల్‌, మోనాల్‌కు ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇచ్చిన అఖిల్‌… అభిజిత్‌, హారిక‌, లాస్య‌, మెహ‌బూబ్‌ల‌ని ఎనీమీలుగా నిల‌బెట్టాడు. అభిజిత్ నీ సోచ్ ఎక్క‌డో ప‌డిపోయింద‌ని గ‌ట్టిగా క్లాస్ పీకాడు.. ఫైన‌ల్‌గా అఖిల్ బ‌య‌టికి వెళ్ల‌డం లేద‌ని మీతోనే హౌస్‌లో కొన‌సాగుతున్నాడ‌ని చెప్ప‌డంతో సోహైల్ ఆనందంతో కేక‌లు వేశాడు. ఆ త‌రువాత కెప్టెన్సీ టాస్క్ కోసం ప‌రీక్ష పెట్టిన నాగ్ త‌రువాత అఖిల్‌ని నేరుగా కెప్టెన్‌గా నామినేట్ చేయ‌డం విశేషం. ఈ రోజు ఎలిమినేష‌న్‌లో వున్న కాంటెస్టెంట్‌ల‌లో అభిజిత్ సేఫ్ అయ్యాడు. ఆదివారం హైస్ నుంచి ఎవ‌రు ఎలిమినేట్ కానున్నారో తెలియ‌బోతోంది. మోనాలా? మ‌ఎహ‌బూబా అన్న‌ది ఆదివారం తేల‌బోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news