‘మోనాల్’కు అఖిల్ గోరుముద్దలు… చీపురుతో చితక్కొట్టిన గంగవ్వ…?

తొలి వారం చప్పగా సాగిన బిగ్ బాస్ షో ఇప్పుడిప్పుడే ఆసక్తికరంగా మారుతోంది. తొలివారం ముక్కూమొహం తెలియని కంటెస్టెంట్లు అని ఫీలైన వీక్షకులు ఇప్పుడిప్పుడే ఎవరి మనస్తత్వాలు ఏంటో, ఎవరిని హౌస్ లో ఉంచాలో, ఎవరిని బయటికి పంపించాలో పూర్తి అవగాహనతో ఉన్నారు. తాజా ఎపిసోడ్లు వీక్షకులను బాగానే అలరిస్తున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో మోనాల్ గజ్జర్ కు అఖిల్ తినిపించడం హైలెట్ అయింది.

దేత్తడి హారిక అభిజిత్ కు భోజనం తినిపించి అదే ప్లేట్ లో తను కూడా భోజనం చేసింది. హారిక, అభిజిత్ మధ్య కూడా ప్రేమాయణం మొదలైందా…? అనే సందేహం వీక్షకుల్లో మొదలైంది. అభిజిత్ మోనాల్ కు తనకు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారని చెప్పగా మోనాల్ తనకు కూడా ఒకరు ఉండేవారని చెప్పింది. అభిజిత్ మోనాల్ ను తనతో మాట్లాడతానని ఒట్టేయాలని కోరగా హారికకు నువ్వంటే ఇష్టమని పేర్కొంది.

ఆ తర్వాత అభిజిత్ మరి నేనంటే నీకు ఇష్టం లేదా అని మోనాల్ ను ప్రశ్నించగా మోనాల్ ఇష్టం లేకపోతే ఇంతసేపు మాట్లాడతానా….? అని కొంటెగా సమాధానం ఇచ్చింది. మోనాల్ కు అఖిల్ తినిపించడం అభిజిత్ కు ఏ మాత్రం నచ్చలేదు. అనంతరం బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ కోసం టాస్క్ ఇఛాడు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ టాస్క్ లో భాగంగా అత్తా అల్లుడు-అమెరికా మోజు సీరియ‌ల్ చేశారు.

టాస్క్ లో అత్తగా కళ్యాణి కొడుకు, కోడ‌లుగా అభిజిత్, సుజాత కరాటే కళ్యాణి కూతురుగా దివి, మ‌తిమ‌రుపు అకౌంటెంట్‌గా సాయికుమార్, అమెరికా అబ్బాయిగా అఖిల్, పుల్ల‌లు పెట్టే ప‌నిమనిషిగా దేవి చేశారు. సీరియల్ మధ్యలో నోయ‌ల్‌, హారిక‌, సోహైల్‌, అరియానా కమర్షియల్ యాడ్ చేయగా గంగవ్వ వారిని చీపురుతో కొట్టింది. చీపురు పబ్లిసిటీ కోసం గంగవ్వ వారిని చీపురుతో కొట్టడం గమనార్హం. ఈ సీరియల్ ఎపిసోడ్ వీక్షకులను బాగానే ఆకట్టుకుందని చెప్పాలి.