బిగ్ బాస్: కింద నిప్పు.. మధ్యలో మంచు.. అఖిల్ పనైపోయింది..

-

గురువారం బిగ్ బాస్ ఎపిసోడ్ లో హోటల్ టాస్క్ విజేతలుగా అతిధులే గెలిచారు. హారిక దగ్గర్నుండి అభిజిత్ తీసుకున్న స్టార్లని పట్టించుకోని బిగ్ బాస్, అతిధులనే విజేతలుగా ప్రకటించాడు. ఈ అతిధులలో నుండి సోహైల్ బెస్ట్ పర్ ఫార్మర్ గా నిలవడంతో కెప్టెన్ పోటీదారుడిగా నిలబడ్డాడు. మిగతా వారిలో నుండి సీక్రెట్ టాస్క్ చక్కగా కంప్లీట్ చేసినందుకు అవినాష్ ని, ఇంకా.. ఎక్కువ టిప్స్ అందుకున్నందుకు అఖిల్, కెప్టెన్ పోటీదారులుగా బరిలోకి దిగారు.

ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన కష్టతరమైన కెప్టెన్సీ టాస్కులో సోహైల్ విజయం సాధించి కెప్టెన్సీ దక్కించుకున్నాడు. కింద నిప్పు పెట్టి, పోటీదారుల చేతుల్లో మంచు పెట్టి, రెండు దిమ్మల మీద కాళ్ళు మోపి నిల్చునే టాస్కులో అందరూ బాగా ఆడినప్పటికీ మొదటి వికెట్ గా అఖిల్ పడిపోయాడు. ఆ తర్వాత తన వెనకే అవినాష్ కూడా. దాంతో సోహైల్ కెప్టెన్ గా మారాడు. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ కెప్టెన్సీ టాస్క్ ఆసక్తికరంగా సాగింది.

Read more RELATED
Recommended to you

Latest news