బిగ్ బాస్: అవినాష్ ని బాగా వాడుతున్నాడుగా..!

-

బిగ్ బాస్ షో ఒక ప్లాన్ ప్రకారం వెళ్తుంది. ప్రతీ సోమవారం నామినేషన్స్ పేరుతో ఇంటిని వేడిగా మార్చే కంటెస్టెంట్స్, ఆ తర్వాత మెల్లమెల్లగా చల్లబడుతూ వస్తున్నారు. శుక్రవారం వచ్చేసరికి పూర్తిగా చల్లారిపోయి శనివారం ఎలిమినేషన్ కి రెడీగా ఉంటున్నారు. ఐతే కంటెస్టెంట్స్ ని చల్లబర్చే ప్రాసెస్ లో బిగ్ బాస్ టీమ్ అవినాష్ ని బాగా వాడుకుంటుంది. గత వారం నుండి పరిశీలిస్తే ఈ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. ఈరోజు జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో మొత్తం షో అంతా అవినాష్ చుట్టూనే నడిచింది.

బిగ్ బాస్ ఆత్మని అవినాష్ లోకి ప్రవేశపెట్టి అందరి మీదా కామెంట్లు చేస్తూ నవ్వులు పండించారు. ఒక్కొక్కరి మీదా ఒక్కోలా చేసిన కామెంట్స్ అటు కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులకి బాగా నవ్వు తెప్పించాయి. అలాగే అవినాష్ గురించి మాట్లాడుతున్న అరియానా, ఆ తర్వాత పాటలు పాడే సమయంలో అవినాష్ వేసిన జోకులు.. మొత్తంగా చూస్తే శుక్రవారం అనగానే అవినాష్ తో కంటెంట్ ఇప్పించాలని బిగ్ బాస్ యాజమాన్యం డిసైడ్ అయినట్టుంది. ఐతే వాళ్ళనుకున్నట్లుగానే అవన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఈ లెక్కన అవినాష్ ని బిగ్ బాస్ టీమ్ అంత తేలిగ్గా వదిలిపెట్టేలా లేరు.

Read more RELATED
Recommended to you

Latest news